Devara Heroine: ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘శృతి మరాఠే’ గురించి ఈ విషయాలు తెలుసా..!

Fri, 27 Sep 2024-1:30 am,

మరాఠీ యాక్ట్రెస్ శృతి మరాఠే ‘దేవర’ సినిమాలో లీడ్ రోల్లో యాక్ట్ చేసారు. ‘దేవర’ భార్య పాత్రలో యాక్ట్ చేసింది. వరద (వర) తల్లి పాత్రలో నటించింది.

2008లో మరాఠి చిత్రంతో రంగ ప్రవేశం చేసి ఈమె అక్కడ పలు చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో శృతి మరాఠే’కు ఇదే ఫస్ట్ మూవీ.

‘దేవర’ లో శృతి  పాత్రను ఎక్కువ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈమె మరాఠీ, తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో హిట్టైన ‘ముంజ్యా’ చిత్రంలో నటించి మంచి మార్కులే కొట్టేసింది.

‘దేవర’ మూవీతో తంగం పాత్రలో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. సెకండ్ పార్ట్ లోనే ఈమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందట.

సైఫ్ అలీ ఖాన్ నేరుగా తెలుగులో నటిస్తూన్న ఫస్ట్ మూవీ ‘దేవర’. ‘బైర’ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ తో సరిసమానమైన పాత్ర.

‘దేవర’ మూవీని 1980-90ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. మొత్తంగా ‘దేవర’ మూవీతో జాన్వీ, శృతి మరాఠే తో పాటు సైఫ్ అలీ ఖాన్ ముగ్గురు ముంబైకు చెందిన వాళ్లు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link