Monday Remedies: సోమవారం.. ఈ ఐదు పరిహారాలు పాటిస్తే జీవితంలోని అన్నిసమస్యలకు పరిష్కారం..
శివుడిని భోళాశంరుడుగా కూడా పిలుస్తారు. ఆయనను భక్తితో పూజలు చేసిన వారికి ఎలాంటి కోరికలు కూడా తీర్చేస్తుండారంటారు. అందుకే పూర్వకాలంలో దానవులు ఎక్కువగా శివుడిని పూజిస్తూ, తపస్సులు చేస్తుండేవారు..
సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. శివుడికి తెల్లని పదార్థాలతో పూజించడం ఎంతో ఇష్టమనిచెబుతుంటారు. అందుకే.. సోమవారం రోజున.. అన్నం, పెరుగు, నెయ్యి, పంచదార, పాలు, పాలతో అభిషేకం చేస్తుంటారు.
కొందరు భక్తులు సోమవారం రోజున ఉపవాసం చేస్తుంటారు. ఈరోజున ఉపవాసం చేసి, సాయంత్రంపూట దీపం వెలిగించి, ప్రత్యేకంగా భజనలు కూడా చేస్తుంటారు. ఇలా చేస్తే మనకోరికలు తీరుతాయంటారు.
సోమవారం పూజ సమయంలో శివలింగానికి పాలు, బిల్వపత్రం, పూలు, పండ్లు సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పూజ సమయంలో, ఖచ్చితంగా శివలింగం ముందు ఒక నెయ్యి దీపం లేదా అగరబత్తిని వెలిగించండి. దీని ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది.
ఈ రోజున పూజించేటప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం ద్వారా, జీవితంలోని అన్నిరకాల సమస్యలు దూరమైపోతాయి. అదే విధంగా కోరుకున్న అదృష్టం మనం అనుభవిస్తామని చెబుతుంటారు.
ఒక వేళ.. ఎవరైన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, మీరు సోమవారం రుద్రాక్షను దానం చేయాలి. ఈ పరిహారం వైవాహిక సమస్యలను తొలగిస్తుందని, జీవితంలో ఆనందాన్ని తెస్తుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)