Diabetes Control Tips: ఈ ఐదు పదార్ధాలు డైట్‌లో ఉంటే..మందుల్లేకుండానే డయాబెటిస్‌కు చెక్
ఓట్స్
ఓట్స్ తినడం వల్ల డయాబెటిస్ అద్భుతంగా నియంత్రితమౌతుంది. ఓట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ రోగులు ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకోవచ్చు.
నేరేడు కాయలు
నేరేడు గ్రైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నేరేడు డయాబెటిస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుంది.
గ్రీన్ వెజిటబుల్స్
గ్రీన్ వెజిటబుల్స్ డయాబెటిస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తాయి. పాలకూర తినడం వల్ల బ్లడ్ షుగర్ ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం పోషకాలు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి.
చియా సీడ్స్
చియా సీడ్స్ మధుమేహం వ్యాధి నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తాయి. షుగర్ స్థాయిని తగ్గిస్తాయి. చియా సీడ్స్‌లో ఉండే ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది
బాదం
బాదం తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుంది. బాదంలో మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ప్రోటీన్లు, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి.