Krish: రెండో పెళ్లికి సిద్ధమైపోయిన దర్శకుడు క్రిష్.. వధువు ఎవరంటే..!

Thu, 07 Nov 2024-7:40 pm,

మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు అద్భుతంగా తీయడంలో దర్శకుడు క్రిష్ ముందుంటారు. క్రిష్ తీసిన గమ్యం, వేదం లాంటి సినిమాలు ఈ కోవకే వస్తాయి. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు అనుష్కతో ఘాటి అనే చిత్రం తీయబోతున్నారు. ఈ చిత్రంకి సంబంధించిన పోస్టర్ ఈరోజు విరుదలై అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో క్రిష్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.  

డైరక్టర్ క్రిష్ జాగర్లమూడి.. త్వరలోనే మరో వివాహం చేసుకోబోతున్నారట. ఆయన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తాజా సమాచారం. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగబోతోందట. ఈ పెళ్లి నవంబర్ 16న హైదరాబాద్‌లో జరగనున్నట్లు వెల్లడైంది.   

ఇక, క్రిష్ జాగర్లమూడి 2016లో డాక్టర్ అయిన రమ్య ని  పెళ్లి చేసుకున్నారు, కానీ ఐదు సంవత్సరాల.. తర్వాత వారి వివాహ బంధం విడాకుల వరకు వెళ్ళింది. 2021లో వారు పరస్పర అంగీకారంతో.. విడాకులు తీసుకున్నారు. రమ్య యూఎస్‌లో రెండవ పెళ్లి చేసుకుని స్థిరపడిపోయారు. 

క్రిష్ మాత్రం ఒంటరిగా ఉంది పోయారు. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి చల్లాతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు అని తెలుస్తోంది.   

క్రిష్ జాగర్లమూడి టాలీవుడ్‌లో తన గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. క్రిష్ తీసిన ఈ సినిమాలు అన్నీ కూడా.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నవి. ఇక కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న.. ఈ డైరెక్టర్ ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link