Diwali 2024: దీపావళి లక్ష్మీపూజకు సమయమిదే.. ఈ ముహూర్తంలో పూజ చేస్తే మీ ఇంట సిరి సంపదలే..!
దీపావళి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు చేరుకుంటాడు.
అంతేకాదు ఇదే రోజు సత్యభామ నరకాసురుని వధించిందని మరో నమ్మకం కూడా ఉంది. అందుకే ఇళ్లు, పరిసర ప్రాంతాలు దేదీప్యమానంగా దీపాలతో వెలిగిస్తారు. అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు.
ఇలా ప్రతిఏటా దీపావళి పండుగను వేడుకగా జరుపుకుంటారు. ఆశ్వీయుజ అమావాస్య రోజు దీపావళి పండుగ వస్తుంది. లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఆ ఇంటికి సిరిసంపదలు, సుకఃసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం.
అయితే, దీపావళి లక్ష్మీపూజకు సరైన సమయం ఉంది. పండితుల ప్రకారం ఈ సమయంలో పూజిస్తే లక్ష్మీ దేవి అపార అనుగ్రహం మీపై ఉంటుంది. లక్ష్మీదేవి పూజలో దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది.
దీపావళి రోజు సాయంత్రం వేళ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే అక్టోబర్ 31వ తేదీ దీపావళి సందర్భంగా ఈరోజు సాయంత్రం 6:10 నుంచి రాత్రి 8:52 వరకు లక్ష్మీదేవిని పూజించడానికి శుభ సమయం.