Dhanteras- Gold: ధన త్రయోదశి రోజు అద్భుతం.. ఈ సమయంలో బంగారం కొన్నారో మీ ఇంట్లో ధన ప్రవాహామే ఇంకా.. పండితులు ఏమంటున్నారంటే..?
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన దీపావళి పండుగ సందడి కొనసాగుతుంది. దీపావళిని ఐదురోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజున నరకుడ్ని సత్యభామదేవీ సంహరించినందుకు గాను ఆ తర్వాత అమావాస్య రోజున దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటారు.
ప్రతి ఏడాది కూడా దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. దీనిలో ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయగా చెప్తుంటారు. ఈసారి అక్టోబరు 29 నుంచి వరుసగా ఐదురోజులు పాటు వేడుకగా దీవాళిని జరుపుకుంటారు.
అనాదీగా ధన త్రయోదశి రోజున ఏదైన బంగారం లేదా వెండి కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే ధన త్రయోదశిరోజున గురివింద గింజ ప్రమాణమైన బంగారం ను తప్పకుండా కొనుగొలు చేస్తారు.
అయితే.. ఈసారి అక్టోబర్ 29 న ధన త్రయోదశిని జరుపుకొబోతున్నాం. ఈ నేపథ్యంలో.. ఏ సమయంలో బంగారం లేదా వెండి కొంటే కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ రోజున ఉదయం పూట మంచి సమయం ఉందని పండితులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 వరకు దివ్యమైన మూహూర్తం ఉందంట.
ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు కూడా మంచి మూహూర్తం ఉందంట. అంతే కాకుండా.. ధన త్రయోదశిరోజున చాలా మంది రాత్రిళ్లు కూడా దుకాణాలను మూసివేయరు. రాత్రిళ్లు కూడా కొంత మంది టైమ్ ఉంది.
ఆరోజున అర్ధరాత్రి 12 నుంచి తెల్లారితే.. నరక చతుర్ధశి అనగా.. 2 గంటల వరకు మంచి మూహూర్తం ఉందని కూడా పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో బంగారం, వెండి, ఇతర కొత్త వస్తువులు ఏవి కొనుగోలు చేసిన కూడా గొప్ప యోగం కల్గుతుందని, జీవితంలో అనుకొని విధంగా ధనలాభం కల్లుతుందని కూడా పండితులు చెబుతున్నారు.