Diwali 2024: నూనె లేకుండా నీటితోనే దీపాలు.. ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
ఆ తర్వాత ఇలా పెట్టిన దీపాల నల్ల మరకలు పోగొట్టడానికి చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈరోజు మేము అందించబోయే ట్రిక్ తో ఎలాంటి నూనె సహాయం లేకుండా, నల్ల మరకలు కాకుండా ఇంట్లోనే సులభంగా నూనె దీపాలను వెలిగించుకోవచ్చు.
చాలామంది నీటితో వెలిగించిన దీపాలు గంటల తరబడి వెలగవనుకుంటారు. నిజానికి నీటితో వెలిగించిన దీపాలు కూడా గంటల తరబడి వెలుతురునిస్తాయి. నూనె లేకుండా దీపం వెలిగించడానికి ఎలాంటి మంత్రాలు, పూజలు చేయనక్కర్లేదు. కేవలం ఈ చిన్న ట్రిక్స్ తో సులభంగా ఇంట్లోనే నెయ్యి, నూనె లేకుండా గంటల తరబడి దీపాలను వెలిగించవచ్చు.
ముందుగా నీటితో మట్టి దీపాలను వెలిగించడానికి.. కొన్ని మట్టి దీపాలను తీసుకొని నీటిలో గంటపాటు బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న దీపాలను భూమిపై తలకిందులుగా పెట్టి బాగా ఆరనివ్వాలిసి ఉంటుంది.
ఇలా పూర్తిగా ఆరిన దీపాలలో కాస్తంత నీటిని వేసుకొని అందులో ఒత్తిని పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే నీటిని నింపుకునే క్రమంలో దీపాల వత్తి మొత్తం నానిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దీపాన్ని మీకు ఇష్టమైన చోట పెట్టి వెలిగించండి. అంతే నూనె లేకుండా దీపం వెలుగుతుంది.
అయితే నూనె లేకుండా దీపాలు వెలిగించే క్రమంలో ఒత్తి కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి దీనిని తయారు చేసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని కొంతమంది అంటున్నారు. దీనికోసం కూడా కొన్ని ట్రిక్స్ వినియోగించాల్సి ఉంటుంది.
ఒత్తిని తయారు చేసుకునే క్రమంలో అది గట్టిగా ఉండేందుకు పాలను వినియోగించాల్సి ఉంటుందట. దానిని గుండ్రని ఆకారంలో తయారు చేసుకునే క్రమంలో కాస్థాన్ని పాలతో ఒత్తిని బాగా గట్టిగా తాల్చుకోవాల్సి ఉంటుందట. ఇలా తయారుచేసిన ఒత్తిని వినియోగిస్తే దీపం నీటితో కూడా వెలుగుతుందట.