DA hike: డీఏ పెంపు బకాయిలపై బిగ్ అప్డేట్.. ఆరోజు నుంచే అకౌంట్లోకి..!
దీపావళి పండుగ వేళ ఉద్యోగులకు శుభవార్త చెబుతూ.. ఈ మేరకు మేరకు డీఏ ను మూడు శాతం పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. అటు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో గత 15 రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు డిఏ పెంచడానికి సంబంధించి చర్చలు జరిగాయని, ఇందుకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ అందజేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే..
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చిలో కూడా ఉద్యోగుల డి ఏ ను, పెన్షనర్ల డిఆర్ ను కూడా కేంద్రం నాలుగు శాతం పెంచింది. అయితే ఈసారి మూడు శాతం పెంచినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ డి ఏ పెంపుతో ఇప్పటివరకు 50 శాతం నుండీ 53 శాతానికి పెరుగనుంది. జూలై ఒకటవ తేదీ నుంచి పెంచిన డిఏ అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇక దీపావళి సందర్భంగా పెంచిన మూడు శాతం డి ఏ ను జూలై 1 నుంచి కలుపుకొని మరో వారం రోజుల్లో షెడ్యూల్ చేయబడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు డియర్ నెస్ రిలీఫ్ కోసం బకాయిల చెల్లింపు అక్టోబర్ 2024లో షెడ్యూల్ చేయబడిన పెన్షన్ పంపిణీకి ముందు జరగదు అని కేంద్రం తెలిపింది.
ఉపాధి పొందిన కుటుంబ పెన్షనర్లకు అలాగే తిరిగి ఉపాధి పొందుతున్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రస్తుత నిబంధనలు వర్తిస్తాయని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు , హైకోర్టుల రిటైర్డ్ న్యాయమూర్తులకు వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇక తదుపరి సూచనల కోసం ఎదురు చూడకుండా ప్రతి పెన్షనర్ కి డిఆర్ ని లెక్కించే ప్రాసెస్ చేయాలని జాతీయ బ్యాంకులతో సహా పెన్షన్ పంపిణీ చేసే అధికారులకు కూడా సూచించారు.త్వరలోనే పెన్షనర్ల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి