Diwali in World: ఇండియా కాకుండా ఏయే దేశాల్లో దీపావళి జరుపుకుంటారు

దేశంలో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. రేపు దేశమంతా దీపావళి జరుపుకోనుంది. భారతదేశంతో పాటు అనేక ముస్లిం దేశాలు, ముస్లిమేతర దేశాల్లో కూడా దీపావళి జరుపుకుంటారు

అమెరికాలో
న్యూయార్క్ చరిత్రలో తొలిసారిగా దీపావళికి సెలవు ఇవ్వడమే కాకుండా దీపావళి పండుగ జరుపుతోంది. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారతీయ మూలాలకు చెందిన హిందూవులున్నారు. వీరంతా ఘనంగా దీపావళి జరుపుకుంటున్నారు

ఆస్ట్రేలియాలో
ఆస్ట్రేలియాలో కూడా భారతీయులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా దీపావళి ప్రతియేటా అత్యంత ఘనంగా జరుపుకుంటారు
ఇండోనేషియాలో
ముస్లిం దేశమైన ఇండోనేషియాలో దీపావళి పెద్దఎత్తున జరుపుకుంటారు. ఇక్కడ రామ్ లీలా కూడా నిర్వహిస్తారు. దీపావళి పురస్కరించుకుని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
మలేషియాలో
మరో ముస్లిం దేశం మలేషియాలో కూడా హిందూవులు పెద్ద సంఖ్యలో ఉంటారు. అందుకే ఇక్కడ కూడా దీపావళి అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
మారిషస్‌లో
మారిషస్ ఒక హిందూ ప్రాబల్య దేశం. అందుకే ఇక్కడ దీపావళి అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రభుత్వం సెలవు కూడా ఇస్తుంటుంది
పాకిస్తాన్‌లో
భారతదేశం పొరుగు దేశం పాకిస్తాన్‌లో కూడా హిందూవులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందుకే ఇక్కడ కూడా దీపావళి అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
నేపాల్‌లో
భారతదేశపు మరో పొరుగు దేశం నేపాల్‌లో దీపావలి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. నేపాల్ హిందూ దేశం. ఇక్కడ దీపావళి అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రభుత్వం సెలవు కూడా ఇస్తుంది
సింగపూర్‌లో
సింగపూర్‌లో హిందూవులు ఎక్కువ. దీపావళి పురస్కరించుకుని ఈ దేశంలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు
శ్రీలంకలో
శ్రీలంకలో తమిళ హిందూవులు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. అందుకే ఈ దేశంలో కూడా దీపావళి అత్యంత ఘనంగా జరుపుకుంటారు