Vastu Tips For Plants: ఇంట్లో ఈ 5 మొక్కలు నాటకూడదు.. పెడితే కష్టాలను కోరితెచ్చుకున్నట్లే..
ఈ మొక్కలు గాలిలోని కార్బన్డయాక్సైడ్ ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి ముఖ్యంగా పూల చెట్లను నాటుకోవడం వల్ల వాస్తు ప్రకారం కూడా ఆ ఇంట్లో పురోగతి కలుగుతుంది. అయితే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో పెట్టుకోకూడదు దీనివల్ల ఆ ఇంట్లో అష్ట కష్టాలు మొదలవుతాయి ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం
సాధారణంగా జిల్లేడు చెట్టుకు పూజలు చేస్తాం కానీ వాస్తు ప్రకారం జిల్లేడు చెట్టు మన ఇంటి ఆవరణలో ఉండకూడదు ఇది వాస్తు నియమాలకు విరుద్ధం. ఈ మొక్కను ఇంటికి దూరంగా ఎక్కడైనా పెంచుకోవచ్చు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచకూడదు
వాస్తుప్రకారం మన ఇంటి ఆవరణలో ఉండకూడని మరో మొక్క గోరింటాకు దీన్ని ఇంటి ఆవరణలో పెంచకుండా కాంపౌండ్ వాల్ బయట లేదా పెరటి వెనకాల నాటుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో గోరింటాకు చెట్టు నాటకూడదు
వాస్తు ప్రకారం మనం ఇంటి ఆవరణలో పెట్టుకోకూడని మరో చెట్టు చిత్త చెట్టు ఈ చింత చెట్టు వేళ్ళు కొమ్మలు కూడా విస్తారంగా విస్తరిస్తాయి ఈ మొక్కలు ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది
పత్తి చెట్టు కూడా మన ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు ఒకవేళ మీకు పెంచుకోవాలని ఉంటే ఇంటి పెరటి వెనకాల ఇంటికి దూరంగా పెంచుకోవాలి. లేదంటే వాస్తు ప్రకారం మీ ఇంటికి కష్టాలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.
వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో పెంచుకోకూడని మరో మొక్క నిమ్మ ముక్క ఈ నిమ్మ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోకుండా దూరంగా పెట్టాలి వీటిని పెంచుకోకూడదు అని చెబుతున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)