Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

Tue, 15 Oct 2024-10:28 am,

శ్రద్ధా కపూర్.. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈమె 1987 మార్చి 3న ముంబైలో జన్మించింది. 2010లో ఈమె ‘తీన్ పత్తి’ సినిమాలో చిన్న క్యారెక్టర్ తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘లవ్ కా ది ఎండ్’ సినిమాతో హీరోయిన్ గా ప్రమోషన్ పొందింది.

 

 2013లో విడుదైలన ఆషికి 2 సినిమాలో గాయని పాత్రతో శ్రద్ధాకు ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చింది. ఈ సినిమాలోని యాక్టింగ్ కు ఫిల్మ్ ఫేర్ పురస్కారం సైతం అందుకుంది.

ఆ తర్వాత హైదర్, ఏక్ విలన్, ఏబీసీడీ, భాగీ, స్త్రీ సినిమాలతో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ అయ్యారు. అంతేకాదు యాక్టింగ్, సింగింగ్ సహా పలు విషయాల్లో మల్టీ టాలెంటెడ్ శ్రద్ధాను స్టార్ ను చేసిందనే చెప్పాలి.

తాజాగా ఈమె ‘స్త్రీ 2’ మూవీతో బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డులను  బ్రేక్ చేసింది. ప్రభాస్, ఖాన్ త్రయం, సన్ని దేవోల్ వంటి హీరోలకు సాధ్యమైన ఇండస్ట్రీ రికార్డులను ‘స్త్రీ 2’ మూవీతో క్రాస్ చేయడం విశేషం.

తెలుగులో ఈమె ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు ఈ సినిమా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది.

అంతేకాదు శ్రద్ధా కపూర్ కు సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో 93.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రేంజ్ ఫాలోవర్స్ తో అగ్ర స్థానంలో నిలిచింది. ఈమెకు చిరంజీవి తో మంచి రిలేషన్ ఉంది.

అవును శ్రద్ధా కపూర్ తండ్రి.. శక్తి కపూర్ బాలీవుడ్ లో నెంబర్ వన్ విలన్.  ఆయన చిరంజీవి నటించిన ‘యుద్ధ భూమి’ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అటు వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ సినిమాలో నటించాడు.  అంతేకాదు చిరు నటించిన పలు హిందీ రీమేక్ సినిమాల్లో హీరోను ఢీ కొట్టే విలన్ పాత్రల్లో మెప్పించారు.

ఈ రకంగా చిరంజీవి ఫ్యామిలీతో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ మంచి అనుబంధమే ఉంది. వీళ్లు తరుచుగా పలు పార్టీల్లో కలుసుకుంటూ ఇప్పటికీ అదే రిలేషన్ మెయింటెన్ చేస్తూ ఉన్నారు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link