Chiranjeevi Dupe: సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవికి డూప్ గా నటిస్తోంది ఈ కొరియోగ్రాఫరా.. ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ..
మెగాస్టార్ చిరంజీవి తన 46 యేళ్ల కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో తన యాక్టింగ్ మరియు డాన్సింగ్ స్కిల్స్ తో మెప్పించారు. అందులో ఎన్నో సాహోసేపేతమైన సన్నివేశాల్లో నటించారు.
సినిమాల్లో ఎక్కువగా రియల్ స్టంట్స్ చేసే చిరు.. ఒక్కోసారి చేసే రియలిస్టిక్ సన్నివేశాల్లో గాయపడితే.. మొత్తం షూటింగ్ అప్ సెట్ అవుతుంది.
కొన్ని సీన్స్ లో హీరోలకు ఆయా సీన్స్ చేయాలని ఉన్నా.. దర్శకులు, నిర్మాతలు ఇతర యూనిట్ సభ్యులను దృష్టిలో పెట్టుకొని కొన్ని సీన్స్ లో డూప్ తో కానిచ్చేస్తారు.
సినిమాల్లో కూడా ఎక్కువగా రిస్కీ అనుకున్న సీన్స్ మాత్రమే డూప్ తో తెరకెక్కిస్తుంటారు ఆయా దర్శక, నిర్మాతలు. ఇక చిరుకు ఓ వ్యక్తి మూడు దశాబ్దాలకు పైగా డూప్ గా నటిస్తున్నాడు. చిరు తన మూవీల్లో చేయాల్సిన రిస్కీసీన్స్ ను ఈయనే చేస్తున్నాడు.ఆయా సీన్స్ తో మెగాస్టార్ చిరుకు దగ్గరయ్యాడు.
ఆయన ఎవరో కాదు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్. ఈయనది పాల్లకొల్లులోని మార్టూరు. ఈయన తన పేరు మీద 'ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డాన్స్' అంటూ ఓ డాన్సింగ్ కంపెనీ ఉంది. ఈయన ప్రముఖ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో చిరుకు డూప్‌గా నటిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
పలు సినిమాలకు ఈయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. చిరంజీవి విషయానికొస్తే.. గతేడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో పలకరించారు. మరోవైపు ఈ యేడాది చిరంజీవిని కేంద్రం పద్మవిభూషణ్ తో గౌరవించింది.
ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.