Coconut Oil For Tan Removal: కొబ్బరినూనెతో ఇలా తక్షణమే మీ ముఖంపై పేరుకున్న ట్యాన్ వదిలించుకోండి..
మనం ప్రతిరోజూ ఎన్ని స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకున్నా ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. అల్ట్రావైలట్ కిరణాల వల్ల ఇలా ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. ఇది స్కిన్ కేన్సర్‌కు కూడా దారితీస్తుంది.ఈరోజు కొన్ని హోం రెమిడీస్ తో ముఖంపై ట్యాన్ తొలగించుకోవచ్చు. కొబ్బరినూనెలో డీట్యాన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ గ్లో పెంచి ఈవెన్ స్కిన్ టోన్‌కు ప్రోత్సహిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటుంది. దీంతో స్కిన్ ట్యానింగ్ సమస్యను అధిగమిస్తుంది. చర్మంపై కొబ్బరినూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ట్యానింగ్ సమస్యను తక్షణమే నివారిస్తుంది.
కొబ్బరినూనె మసాజ్‌తో లాభాలు.. కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరినూనె కొన్ని చుక్కలను అరచేతిలోకి తీసుకోవాలి. రెండు చేతుల్లోకి తీసుకుని ముఖం పై ఓ ఐదు నిమిషాలపాటు మసాజ్ చేయాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖం కడుక్కోవాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.
కొబ్బరినూనె, షుగర్ స్క్రబ్.. కొబ్బరినూనెతో స్క్రబ్ తయారు చేయడానికి రెండు స్పూన్ల కొబ్బరినూనెలో ఒక్క చెంచా చక్కెర వేసి బాగా కలపాలి. ఈ రెండిటినీ బాగా మిక్స్ చేసి సున్నితంగా సర్క్యూలర్ మోషన్లో రుద్దుతూ ఉండాలి. ఇది ముఖం, మెడ, చేతుల భాగంలో రుద్దుకోవాలి. మూడు నిమిషాలపాటు ఇలా స్క్రబ్ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
పసుపు.. ఈ రెండింటితో కలిపి పేస్ట్ తయారు చేసుకుంటే ముఖం పై ట్యాన్ సులభంగా వదిలించుకోవచ్చు.దీనికి ఒక స్పూన్ కొబ్బరి నూనె కాసింత పసుపు తీసుకుని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ముఖంపై ట్యాన్ పేరుకున్న ప్రాంతంలో ఓ 20 నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
నిమ్మకాయ.. స్కిన్ కంప్లెక్షన్ ఈ రెండు పెంచుతాయి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మకాయ చుక్కలు వేసుకోవాలి. ఈ రెండూ ముఖంపై అప్లై చేసుకున్న తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటిలో ముఖం కడుక్కుంటే చాలు.
కలబంద.. కొబ్బరినూనె, కలబందతో మీ ముఖం మృదువుగా మారుతుంది. ఒక స్పూన్ కొబ్బరినూనెలో కొద్దిగా కలబంద వేసుకోవాలి. దీన్ని ముఖం మేడ భాగంలో అప్లై చేసుకుని 30 నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. ఈ రెండిటి మిశ్రమంతో మీ చర్మం హైడ్రేటెట్ గా ఉండటమే కాదు. స్కిన్ కు మంచి గ్లో కూడా వస్తుంది.