Sunstroke Effect: వడదెబ్బ ఇంట్లో ఉన్నా తగులుతుందా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?
కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం పదిదాటిందంటే చాలు. భానుడు భగభగ మండిపోతున్నాడు. బైటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లోద్దని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఎండ వేడికి చాలా మంది వడదెబ్బలకు గురౌతున్నారు.
ఎండలో ప్రస్తుతం కొన్ని చోట్ల 45 డిగ్రీల వరకు ఉంటున్నారు. ఎండలో వెళ్తున్న వారుతప్పకుండా ఫుల్ గా నీళ్లు తాగి వెళ్లాలి. అంతేకాకుండా.. వాటర్ బాటిల్, గొడుగు, క్యాప్, దాహాం వేసిన వేయకున్న తరచుగా నీళ్లను తాగుతుండాలి. లేకుండా శరీరమంతా డీహైడ్రేషన్ గురిఅయిపోతుంది.
ఎండలో వెళ్లిన వారికి ఒక్కసారిగా తలతిరగడం, కళ్ల ముందు చీకటిగా రావడం, బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడం, నాలుక పోడిబారిపోయి బైటకు రావడం, కళ్లు బైర్లు కమ్మడం వంటివి వడదెబ్బ తగిలినట్లు సింప్టమ్స్ అని చెబుతుంటారు. వెంటనే వీళ్లను నీడలో తీసుకెళ్లాలి. ఒంటిపై బట్టలు తీసేసి గాలి ఆడేలా చేయాలి. చల్లని బట్టతో.. శరీరంను తుడవాలి.వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి..
కొందరు తాము ఇంటి నుంచి బైటకు వెళ్లం. ఇంట్లోనే ఉంటాం. తమకు వడదెబ్బ ఎఫెక్ట్ ఉందని వాదిస్తుంటారు. కానీ వడదెబ్బ అనేది ఇంట్లో ఉన్న కూడా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న వేడిగాలులు ఇంట్లో ప్రవేశిస్తుంటాయి. ఇళ్ల పైకప్పు నుంచి వేడి లోపలికి ప్రవేశిస్తుంది. అందుకే ఇంట్లో ఫ్యాన్ పెట్టుకున్నప్పుడు వేడిగాలి వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న కూడా.. 60 ఏళ్లుదాటిన వారు, 10 ఏళ్లు లోపల వయస్సు ఉన్న వారు వడదెబ్బ ప్రభావానికి గురయ్యే అవకాశాలు ఎక్కువని నిపుణులు అంటున్నారు.
అరవై ఏళ్లు దాటాక, చిన్న పిల్లలకు ఇమ్యునిటీ తక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఎండ ప్రభావానికి గురైపోతుంటారు. ఇంట్లో ఉన్నాం కదా.. అని మాకేంటీ ఎండ ప్రభావ అనుకోకూడదు. ఇంట్లో ఉన్న కూడా నీళ్లను ఎక్కువగా తాగుతుండాలి.దాహాం వేసిన, వేయకున్న నీళ్లను, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ లను ఎక్కువగా తింటుండాలి.
మధ్యాహ్నాం సమయంలో ఇంటి బాల్కనీలో నిలబడటం, కిటికీలు తెరిచి ఉంచుకోవడం వల్ల వేడిగాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీంతో వడ దెబ్బ ప్రభవానికి గురౌతారు. ఇంట్లో ఉన్న కూడా ఇంటి పైకప్పుకు సూర్యకూల్ లేదా చల్లదనం కల్గించే పెయింటింగ్ లను ఇంటి పైభాగంలో వేసుకోవాలి. ఇంటిలోపల చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటూ కాస్తంతా వాతావరణం చల్లగా ఉంటుంది.
ఎండకాలంంలో ముఖ్యంగా ఆయిలీ ఫుడ్, వేపుళ్లు, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలి. ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. వదులుగా ఉండే దుస్తులను ధరించాలి,ఎండలో బైటకు వెళ్లినప్పుడు గొడుగులు తీసుకెళ్లాలి. తరచుగా కొబ్బరి బొండం, ఫ్రూట్ జ్యూస్ లను ఎక్కువగా తాగుతుండాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)