Donald Trump: ఎన్నికల ముందు 8 బిలియన్ డాలర్లకు పెరిగిన ట్రంప్ ఆస్తులు.. అసలు కారణం తెలిస్తే షాకే..!
78 ఏళ్ల డోనల్డ్ ట్రంప్ ఆస్తులు ఎన్నికల ముందు భారీగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం తెలిస్తే మీరు కూడా షాకవుతారు ప్రస్తుతం ట్రంప్ నెట్ వర్త్ 8 బిలియన్ డాలర్లు. అయితే, ఇటీవలి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ట్రంప్ నికర ఆస్తుల విలువ ఒక్కసారిగా డబుల్ అయిందట.
గతంలో 4 బిలియన్ డాలర్లు ఉన్న ట్రంప్ ఆస్తులు ఒక్కసారిగా అక్టోబర్ 29 నాటికి 8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా 357వ స్థానాన్ని ఎగబాకాడని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియన్ ట్రాకర్ వెల్లడించింది.
డోనాల్డ్ ట్రంప్ అమెరికాలోనే అత్యంత ధనికుల్లో ఒకరు.ఈయన ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. 2024 లో డోనల్డ్ ట్రంప్ ఆస్తుల విలువ 6.7 బిలియన్ డాలర్లు అంటే మన భారత్ రూపీలో (5,59,57,96,45000). ట్రంప్‌కు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.కానీ, ఎక్కువ శాతం అతని సొంత మీడియా గ్రూప్ నుంచే ఆర్జిస్తారు.
అయితే, డోనల్డ్ ట్రంప్ ఆస్తులు ఇలా ఒక్కసారిగా డబుల్ అవ్వడానికి ప్రధాన కారణం అతని మీడియా సంస్థ టీఎంటీజీ (ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్) షేర్లు ఎన్నికల ముందు భారీగా ర్యాలీ చేశాయట. ఏకంగా షేర్ ధర అక్టోబర్ ముందు 16.16 % నుంచి 249.2% పెరిగింది. ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ పేరెంటింగ్ కంపెనీ 'ట్రూత్ సోషల్' షేర్ కూడా 9 శాతం పెరిగిందట.
ఈ టీఎంటీజీ మార్కెట్ వ్యాల్యూ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లు అంటే ఎలన్ మాస్క్ X కంపెనీకి సమానం. ఈ విజయవంతమైన బిజినెస్‌మెన్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్ 500 వరల్డ్ రిచెస్ట్ జాబితాలో స్థానం సంపాదించారు. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధిస్తారా ? లేదా? అనేది ప్రజలు నిర్ణయించాల్సి ఉంది.