Donald trump daughter engagement: అధ్యక్షుడిగా ట్రంప్ చివరిరోజున కుమార్తె టిఫనీ నిశ్చితార్ధం

Wed, 20 Jan 2021-7:51 pm,

డోనాల్డ్ ట్రంప్‌కు ఐదుగురు సంతానం. ట్రంప్ ప్రస్తుత భార్య మెలానియా ట్రంప్‌తో 14 ఏళ్ల కుమారుడు బైరన్ ఉన్నాడు. అటు మొదటి భార్య ఇవానా ట్రంప్‌తో 43 ఏళ్ల జూనియర్ ట్రంప్, 39 ఏళ్ల ఇవాంకా, 37 ఏళ్ల ఎరిక్ ఉన్నారు. 

అటు టిఫనీ ట్రంప్ మంగేటర్ మైకేల్ బ్లౌస్ వయస్సు 23 ఏళ్లే. నైజీరియా వాసి కుమారుడు మైకేల్.  నైజీరియాలోని లాగోస్ నుంచి ప్రాధమిక విద్య అనంతరం గ్రాడ్యుయేషన్ లండన్‌లో చేశాడు. లండన్‌లో మైకేల్ , టిఫనీలు తొలిసారి కలుసుకున్నారు. 

27 ఏళ్ల టిఫనీ ట్రంప్..డోనాల్డ్ ట్రంప్ , అతని రెండో భార్య మాలీ మేపల్స్‌ల ఏకైక సంతానం. ఈమె జార్జ్‌టౌన్ యూనివర్శిటీలోని లా స్కూల్ నుంచి గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది. 

టిఫనీ ట్రంప్ తన ఫోటోలతో పాటు మైకేల్ బౌల్స్ ఫోటోల్ని కూడా షేర్ చేసింది. నా జీవిత ప్రియుడితో నిశ్చితార్ధం జరుపుకున్నానని..ఇద్దరూ కలిసి తదుపరి కార్యక్రమం కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. 

వైట్‌హౌస్‌లో చారిత్రాత్మక సందర్భాల్లో వేడుకలు నిర్వహించడం, కుటుంబంతో గడపడమనేది ఎప్పటికీ మర్చిపోలేని గౌరవమని..కానీ తన మంగేటర్‌తో నిశ్చితార్ధం కంటే ఎక్కువ కాదని డోనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ వ్యాఖ్యానించింది. ఆశీర్వదింపబడుతున్నానని...తదుపరి ఘట్టం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని రాసింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link