4 wickets in 4 balls: క్రికెట్ చరిత్రలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు వీళ్లే..!
ఏ ఫార్మాట్‌లో అయినా తన యార్కర్లతో భయపెట్టాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ. 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, జాక్వెస్ కల్లిస్, మఖాయలను వరుసగా నాలుగు బంతుల్లో ఔట్ చేసి రికార్డు సృష్టించాడు.
విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ భారత్ ఏ జట్టుతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, నమన్ ఓజా, యూసుఫ్ పఠాన్‌లను ఔట్ చేశాడు.
UCB-BCB ఎలెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అబాహానీ లిమిటెడ్‌పై టీ20 మ్యాచ్‌లో అల్-అమీమ్ హుస్సేన్ 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు.
ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ మార్క్ బట్‌చర్ సోదరుడు గ్యారీ బట్‌చర్ తన అద్భుతమైన బౌలింగ్‌తో డెర్బీషైర్‌పై సర్రే తరఫున డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.
1996లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సంజయ్ మంజ్రేకర్, విక్రమ్ రాథోర్ వికెట్లను హాంప్‌షైర్ తరపున ఆడుతున్న కెవాన్ జేమ్స్ పడగొట్టాడు. 2014 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సస్సెక్స్‌పై సోమర్‌సెట్ బౌలర్ అల్ఫోన్సో థామస్ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు.