Driving License: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక పై టూ వీలర్ లైసెన్సును ఫోర్ వీలర్ లైసెన్స్‎గా మార్చుకోండి.. ఫోన్​లోనే ఈజీగా ఇలా

Thu, 02 Jan 2025-9:51 pm,

Driving License in Telangana: చాలామంది ముందుగా టూవీలర్ తీసుకొని దానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇంటి అవసరాలు, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎన్నో అవసరాలు ద్రుష్ట్యా మరో వాహనం కొనుగోలు చేస్తారు. కారు, ఆటో ఇంకా మరేదైనా వెహికల్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఇలా మరో వెహికల్ తీసుకున్నప్పుడు దానికోసం సపరేట్ గా ఇంకో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా.. ఉన్న టూ వీలర్ లైసెన్స్ లోని ఆ వెహికల్ ని యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుంది తెలంగాణ సర్కార్. అదిలాగో ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా కొత్త వెహికల్ కోసం లెర్నింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసం స్లాట్ బుక్ చేసుకుని మీరు ఎంచుకున్న ఆర్టిఏ ఆఫీసులో డెమో టెస్ట్ క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కి దరఖాస్తు చేసుకొని టెస్ట్ డ్రైవ్ పూర్తి చేస్తే మీకు కొత్త వెహికల్ యాడ్ అయిన న్యూ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.

దీనికి అవసరమైన పత్రాలు ఏవో చూద్దాం:  మునుపటి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ అవసరమవుతాయి.  

న్యూ వెహికల్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం: ముందుగా తెలంగాణ ఆర్టిఏ అధికారిక పోర్టల్  https://transport.telangana.gov.in/ ను సందర్శించాలి.  ఆ తర్వాత హోం పేజ్ లో రైట్ సైడ్ లో ఉన్న  "For Online Services and Payments Click Here" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఇప్పుడు దానిపై క్లిక్ చేస్తే న్యూ పేజ్  ఓపెన్ అవుతుంది.  

ఓపెన్ అయిన తర్వాత కొత్త పేజీలో "Learner Licence for Addition of a New Class of Vehicle" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దానిపై క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ అయిన పేజీలో Continue Slot Booking అనే ఆప్షన్ పై నొక్కాలి .   

తర్వాత ఓపెన్ అయిన పేజీలోLearner Licence for Addition of a New Class of Vehicle  అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.  దానికింద డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇష్యూ డేట్ అఫ్ బర్త్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అవి ఎంటర్ చేస్తే మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఇప్పుడు దాని ఎంటర్ చేయాలి.  

తరువాత మీ డ్రైవర్ లైసెన్స్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్పై మరోసారి క్లిక్ చేయాలి. తర్వాత మీ వివరాలన్నీ ఓపెన్ అవుతాయి. అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్ వంటి మిగతా వివరాలను ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ లో యాడ్ చేయాలనుకుంటున్నా మీ న్యూ వెహికల్ క్లాస్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వివరాలన్నీ సరిచూసుకొని ఆప్షన్ పైన నొక్కాలి.   

లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ కోసం తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక చివరగా దానికి కావాల్సిన డబ్బులు చెల్లించాలి.  ఆపై అప్లికేషన్ ప్రింట్ పై నొక్కి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి.  తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న సమయంలో ఆర్టిఏ ఆఫీసులో డెమో టెస్ట్ క్లియర్ చేస్తే లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link