Indian Railways: అతలాకుతలమైన మహబూబాబాద్‌.. ధ్వంసమైన రైల్వే ట్రాక్స్‌.. నిలిచిపోయిన రైల్లు..!

Sun, 01 Sep 2024-10:39 am,

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖలు కూడా హెచ్చరిస్తున్నాయి. గోడ కూలి కొందరు, వాగులో కొట్టుకుపోయి మరికొందరు  అక్కడక్కడ చనిపోయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ కూడా ధ్వసం కావడంతో మహబూబాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ కూడా నిలిచిపోయింది.  

అయితే, మహబూబాబాద్‌ మార్గంలో కూడా రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది. ముఖ్యంగా అక్కడ దగ్గరల్లోని చెరువు కట్ట తెగిపోవడంతో రైలు పట్టాలు ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైల్లు కూడా నిలిచిపోయాయి.  ముఖ్యంగా మహబూబాబాద్‌ ఇంటికన్నె నుంచి కేసముద్రం వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్‌ కంకర పూర్తిగా కొట్టుకుపోయింది.  

దీంతో ఆ మార్గం గుండా వెళ్లే రైళ్లను నిలిపివేశారు. హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడల్లో ఉండే లోతట్టు ప్రాంతాలన్ని ఇప్పటికే జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలకు అప్రమత్తత పాటించాలని సూచించాయి.  

ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్‌ అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగిపోయింది. ఇది అక్కడి దగ్గరిలో ఉన్న రైల్వే పట్టాలకు తాకింది. వరద నీరు భీభత్సానికి ట్రాక్‌లో ఉండే కంకర కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ మార్గం గుండా వెళ్లే రైళ్లను నిలిపివేశారు.  

మరోవైపు ఏపీలో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. తెలంగాణలో కూడా ఇప్పటికే సోమవారం కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link