Rain Alert: ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ?
Rain Alert: ఆంధ్ర ప్రదేశ్ ను కొన్ని రోజులుగా వరుణ దేవుడు ఒదలడం లేదు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను కారణంగా తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ.
తుఫాను ప్రభావంతో తమిళనాడు , దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదముందని అలర్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లవద్దని సూచించింది.
తుపాను ప్రభావంతో తమిళనాడులోని ఏడు జిల్లాలకు రెడ్‌అలెర్ట్ జారీ చేశారు. నాగపట్టిణం, మయిలాడుదురై, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విళుపురం జిల్లాలకు విపత్తు నిర్వహణ దళాల్ని పంపించారు.
ప్రభావిత జిల్లాల్లో 2,229 సహాయక కేంద్రాల్ని సిద్ధం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు.. అక్కడ పరిస్థితులు బట్టి ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలకు సెలవు ప్రకటించే వెసులుబాటు కల్పించింది. మొత్తంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అక్కడ జిల్లా, మండలాధికారులు అప్పటి కప్పుడు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.