PM Kisan Yojana: దసరా ముందు రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. నేడు రూ.2000 ఖాతాల్లో జమా..
PM Kisan Yojana 18 th Installment: ప్రతి ఏడాదికి మూడు సార్లు రైతుల సంక్షేమం కోసం రూ. 2000 డబ్బులను జమా చేస్తుంది కేంద్రం. ఈ నేపథ్యంలో 18వ విడత డబ్బులు ఈ రోజు అక్టోబర్ 5వ తేదీ రైతుల ఖాతాల్లో జమా కానున్నాయి. జూన్ నెలలో 17వ విడత డబ్బులను విడుదల చేసింది కేంద్రం.
ఏడాదికి మూడు విడతల్లో కేంద్రం డీబీటీ ద్వారా రూ.2000 జమా చేస్తారు. ఆర్థికంగా చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడానికి మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ప్రధాని మోడీ చేతుల మీదుగా నేడు రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా ఈ డబ్బులు జమా కానున్నాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతులు లబ్ది పొందనున్నారు. దీనికి కేంద్రం రూ.20 వేల కోట్లను ఖర్చుచేయనుంది.
పీఎం కిసాన్ యోజన ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.2000 జమా చేస్తోంది. దీంతో ఏడాదికి రైతుల ఖాతాల్లో కేంద్రం తరఫున రూ.6,000 సహాయం అందుతుంది. నేరుగా అన్నదాతల ఖాతాల్లో ఈ డబ్బులు డిపాజిట్ అవుతాయి.
ఇదిలా ఉండగా జమ్మూ, కశ్మీర్‌లో ఉండే రైతులకు మాత్రం రూ.10,000 ఏడాదికి జమా చేయనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాగంగా కేంద్రం ఈ మేరకు హామీ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో ఉన్న రైతులకు రూ.3,000 ఏడాదికి రెండుసార్లు, రూ.4000 ఒక్కసారి మొత్తం రూ.10,000 జమా చేయనుంది.