2024 Best Business Ideas: జీవితాన్ని మార్చే బెస్ట్ ఐడియా.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.30 వేలు సంపాదించండి..
ఫుడ్ బిజినెస్‌లు ప్రస్తుతం చాలా మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఈ వ్యాపారంలో లక్షలు సంపాదించవచ్చు. ఈరోజు మనం బంగాళాదుంపలతో చేసే వ్యాపారం గురించి తెలుసుకుందాం. మార్కెట్‌లో బంగాళాదుంపలకు భారీ డిమాండ్ ఉంది.
సాధారణంగా బంగాళాదుంపలతో చిప్స్‌ను తయారు చేస్తారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా వీటిని విక్రయిస్తుంటాయి. ఈ చిప్స్‌ను మీరు ఇంట్లోనే తయారు చేసి మార్కెట్‌లో అమ్మవచ్చు. దీంతో మీరు రోజుకు వేయి రూపాయిలు పంపాదించవచ్చు.
బంగాళాదుంపల చిప్స్ తయారు చేయడం కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చిప్స్ మేకింగ్ మెషిన్ రూ. 850 ఉంటుంది. మీరు తయారు చేసిన చిప్స్‌ను ఇంటి చుట్టు పక్కల, లేదా సూపర్ మార్కెట్‌లో కూడా అమ్మవచ్చు.
మీరు చిన్న షాప్ తెరిచి ఎలాంటి భారీ మెషిన్ లను కొనుగోలు చేయకుండా కేవలం ముడి పదార్థాలతో కూడా బిజినెస్ ప్రారంభించవచ్చు. దీని కోసం ప్రభుత్వం ఇచ్చే ముద్ర లోన్ పథకాలు కూడా ఉపయోగించవచ్చు.
సోషల్ మీడియా నిజంగా చిన్న వ్యాపారాలకు బంగారు గనిలాంటిది. ముఖ్యంగా బంగాళాదుంప చిప్స్ లాంటి ఫుడ్ బిజినెస్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిప్స్ ఎంతో రుచికరంగా, క్రిస్పీగా ఉన్నాయో చూపించే హై-క్వాలిటీ ఫోటోలు తీయండి.
చిప్స్ తయారీ ప్రక్రియ, ప్యాకేజింగ్, టేస్టీ టిప్స్ వంటి వీడియోలు చేయండి. షార్ట్ ఫార్మాట్ రీల్స్‌తో మీ ఉత్పత్తులను ప్రచారం చేయండి. దీంతో మీ బ్రాండ్ కొంత సమయంలోనే ఎక్కువగా గుర్తింపు లభిస్తుంది.
ఈ బిజినెస్‌తో మీరు నెలకు రూ. 30 వేలు సంపాదించవచ్చు. సంవత్సరానికి మీరు రూ. 365,000 సంపాదించవచ్చు. మీకు ఈ ఐడియా నచ్చితే వెంటనే ప్రారంభించండి.