Earthquake Reasons: ఈ రోజు భూకంపాలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. మీకు తెలుసా?

Wed, 04 Dec 2024-11:52 am,

ఉదయం 7.25 గంటల వచ్చిన భూ ప్రకంపనలతో జనాలు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఈ మూడు సెకండ్లు ఏం జరిగిందో తెలియక ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. తెలంగాణాలోని హైదరాబాద్‌తో పాటు వరంగల్,  ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రాద్రి జిల్లాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది.

అలాగే తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో భూమి చాలా హెవీగా కంపించింది. ఇందులో ప్రధానంగా భద్రాచలం ప్రాంతాలతో పాటు కొత్తగూడెం, నాగులవంచ, మణుగూరు, ఇతర కొన్ని ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ఎక్కువుంది.  

ఇప్పటికీ చాలా మంది ఈ భూకంపాలు ఎందుకు వస్తాయో తెలియదు. నిజానికి భూప్రకంపనలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

కాలక్రమేన భూమిలోపల ఉపరితలం పలు భాగాలుగా విడిపోతూ ఉంటుంది. వీటినే ఖగోళ శాస్త్రంలో టెక్టోనిక్ పలకలు అని అంటారు. అయితే ఈ పలకలు అప్పుడప్పుడూ కదులుతూ ఉంటాయి. దీని కారణంగా భూమిలో ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా భూకంపలు ఏర్పడతాయి.  

కొన్ని చోట్ల భూకంపాలు రావడానికి అగ్నిపర్వతం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పేలినప్పుడు, భూమి లోపలి నుంచి లావా, బూడిద వంటివి బయటకు వస్తూ ఉంటాయి. ఈ కార్యకలాపాల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో భూమి కంపిస్తుంది..

పూరతన కాలంలో ఏర్పడిన భూమి కింద ఉన్న గుహలు లేదా పాత గనుల కాలక్రమేన కుంగిపోవడం వల్ల కూడా ఈ భూకంపాలు వస్తాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.   

కొన్ని చోట్ల భారీ ఆనకట్టలు నిర్మించడం, భూగర్భ జలాలు  నిర్మించడం, చెట్లు నరకడం వల్ల కూడా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

భూమి లోపలి భాగంలోని ఉష్ణోగ్రత, ఒత్తిడి మార్పులు కూడా భూకంపాలకు కారణమవుతావుతాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే భూమిపై జరిగే వివిధ మార్పుల కారణంగా కూడా ఈ భూమిపై ప్రకంపనలు వస్తాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link