Shanidev: ఈ పరిహారాలు పాటిస్తే.. ఇట్టే శనిదోషాలు పోవడంతో పాటు శనీశ్వరుడు మీకు గొప్ప లాభాలు కల్గజేస్తాడు..
చాలా మంది ఇటీవల శనీదోషంతో బాధపడుతుంటారు. దీని వల్ల జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కానీ కొన్ని పరిహారాలు పాటిస్తే శనీదేవుడ్ని ఈజీగా ప్రసన్నం చేసుకొవచ్చు.
శనిదేవుడికి పదకొండు లేదా ఇరవై ఒకటి శనివారాలు తైలాభిషేకం చేయాలి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి తమలపాకులతో పూజలు చేయాలి.
నల్లని చీమలు, కాకులకు ఏదైన తినేందుకు పెట్టాలి. ట్రాన్స్ జెండర్ కు ఏదైన దానం ఇస్తుండాలి. రావి చెట్టు కింద ప్రతిరోజు దీపారాధన చేస్తుండాలి.
పదకొండు శనివారాల వ్రతం చేస్తే శనీశ్వరుడి అనుగ్రహాం కల్గుతుందని కూడా పండితులు చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామినికొలుచుకున్న కూడా గ్రహా బాధలు దూరమౌతాయి.
పేదలకు అన్నదానం చేయాలి. సాడేసాతి,ఏలినాటి దోషాలున్న వారు ముఖ్యంగా.. ఎవరిని కూడా మనస్సులు నొప్పించే పనులు చేయోద్దు. నిరంతరం ఏదైన పనుల్లో లేదా దైవ స్మరణ చేస్తుండాలి.
శనీదోషంతో ఉన్నవారు నల్లని చీమలకు బెల్లం, ప్రవహిస్తున్న నదిలో మీపై ఎర్రటి మిరపకాయలు తిప్పుకుని అక్కడ పారేయాలి. ఇలా చేస్తే మీకు ఉన్న శనిదోషాలు పోవడంతో పాటు శనీశ్వరుడి అనుగ్రహాం మీ సొంత మౌతుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)