Flat Belly Tips: పొట్ట స్లిమ్‌గా కనబడాలనుకుంటున్నారా? అయితే రోజు వీటిని తినండి..
బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు తొందరగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగానే బెల్లీ ఫ్యాట్ పెరుగుతోంది. కాబట్టి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవడమే కాకుండా వ్యాయామాలు కూడా తప్పనిసరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొంతమందిలో పొట్ట పెరగడం కారణంగా షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోయి. థైరాయిడ్ వంటి సమస్యల బారిన పాడుతున్నారు. అయితే ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు ఈ ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
శరీర బరువును అదుపులో ఉంచేందుకు గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో గుడ్డును తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గుడ్డు తీసుకునే క్రమంలో పచ్చసొనను వదిలేసి తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రోబయోటిక్ అధిక మోతాదులో లభించే పెరుగును తీసుకోవడం వల్ల కూడా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణాశయశక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి శరీర బరువును కూడా ఎంతో సులభంగా నియంత్రిస్తాయి.
బీన్స్, కాయధాన్యాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు. ఈ రెండిటిలో అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు డైట్లో తీసుకుంటే సులభంగా కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు.
శరీర పరువును నియంత్రించేందుకు పచ్చి బఠానీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా డైట్లో పచ్చిబఠానీలను చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి తక్షణ శక్తినిచ్చేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.