Soaked Badam: నానబెట్టిన బాదం తినొచ్చా.. కలిగే లాభాలు ఏంటి?
నానబెట్టిన బాదం ఆరోగ్య ప్రయోజనాలు
గుండె ఆరోగ్యం: బాదం పప్పులలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బరువు తగ్గడం: బాదం పప్పులు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చర్మం ఆరోగ్యం: బాదం పప్పులలో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
జుట్టు ఆరోగ్యం: బాదం పప్పులు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి.
ఎముకల ఆరోగ్యం: బాదం పప్పులలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి.
మెదడు ఆరోగ్యం: బాదం పప్పులు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
షుగర్ లెవెల్స్ నియంత్రణ: బాదం పప్పులు షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.