Eesha Rebba Pics: చుడీదార్‌లో ఈషా రెబ్బా.. తెలుగు అందం అదిరిందబ్బా!

Thu, 25 Aug 2022-8:11 pm,

మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రెసుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈషా రెబ్బా.. తాజాగా చుడీదార్‌లో ఫోటో షూట్ చేశారు. తాజా ఫోటోలలో తెలుగు అందం అదిరిపోయారు.   

ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తన హాట్ ఫొటోస్‌తో కుర్రకారుకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు నెట్టింట లైకుల వర్షం కురుస్తుంటుంది.  

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో ఈషా రెబ్బా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అయితే అవన్నీ సైడ్ క్యారెక్టర్లు కావడం గమనార్హం. హీరోయిన్‌గా ఓ మంచి సినిమా కోసం ఈషా ఎదురు చూస్తున్నారు.   

అందంతో పాటు అభినయం ఉన్న ఈషా రెబ్బాకు సరైన సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. దాంతో సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టారు. తెలుగు ఓటీటీలో ఆమధ్య వచ్చిన 'పిట్ట కథలు', 'త్రీ రోజెస్'తో ఆకట్టుకున్నారు.   

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసి మెప్పించారు. బ్రాండ్ బాబులో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.  

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link