Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మాస్క్.. 10 ఆసక్తికర విషయాలు
Facts About Elon Musk: టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్(Elon Musk) నిలిచారు.
అక్టోబర్ 2017 నుంచి అపర కుబేరుడిగా కొనసాగుతున్న అమెజాన్(Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించాడు. 500 మంది కుబేరులతో బ్లూమ్‌బర్గ్ రూపొందించిన బిలియనీర్స్ జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..
ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పేరిట, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎల్ఎల్‌సీ పేరిట ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కంపెనీలు నిర్వహిస్తుండగం గమనార్హం.
ఎలాన్ మస్క్ సంపద నికర విలువ గురువారం నాటికి 188.5 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.14.13 లక్షల కోట్లు.
ప్రపంచ కుబేరుడుగా ఎలాన్ మస్క్‌కు దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం ఉంది.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
కేవలం 9 ఏళ్ల వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సొంతం నేర్చుకోవడం ప్రారంభించాడు ఎలాన్ మస్క్. 12 ఏళ్ల వయసులోనే బ్లాస్టర్ అనే స్పేస్‌కు సంబంధించిన గేమ్ రూపొందించి విక్రయించాడు.
చిన్న వయసు నుంచే సొంతంగా రాకెట్ తయారు చేయడం ప్రారంభించిన వ్యక్తి ఎలాన్ మస్క్. ఆసక్తితోనే ప్రైవేట్ స్పేస్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. రెండు సార్లు కాలేజీ, యూనివర్సిటీ నుంచి డ్రాపౌట్ అయ్యాడు.
చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకపోయే స్వభావం ఉండటంతో చెవిటివాడు అయినందున తమ కుమారుడు ఏం వినడం లేదని, అందుకే మాట్లాడటం లేదని ఎలాన్ మస్క్ తల్లిందండ్రులు భావించేవారు.
ఎలాన్ మస్క్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ముగ్గురు భార్యలతోనూ విడాకులు తీసుకున్నాడు. ఇయనకు ఆరుగురు సంతానం కాగా, అంతా అబ్బాయిలే. ప్రస్తుతం గ్రైమ్స్ అనే తన ప్రియురాలితో డేటింగ్‌లో ఉన్నాడని తెలిసిందే.
Also Read: Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విలువ గురువారం 7.4 శాతం పెరిగి.. 811 డాలర్ల గరిష్ట స్థాయికి చేరడంతో ఆయన అత్యంత ధనవంతుడు అయ్యారు.
Also Read: Xiaomi Mi 10i Price: భారత్‌లో 108 MP కెమెరా ఫోన్ లాంచ్, ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే