ED Raids: గత 9 ఏళ్లలో ఈడీ జప్తు చేసిన డబ్బులెంతో తెలిస్తే నిశ్చేష్టులవడం ఖాయం, అక్షరాలా 1.16 లక్షల కోట్లు
గత నాలుగేళ్లలో పీఎంఎల్ఏ కింద ..69,045.89 కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టినట్టు ఈడీ తెలిపింది.
ఇది కాకుండా ఆర్ధిక నేరస్థుల చట్టం 2-18 ప్రకారం 16,740.15 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది.
జనవరి 2014 నుంచి 31 అక్టోబర్ 2023 వరకూ పీఎంఎల్ఏ 2002 ప్రకారం ఈడజీ 1,16,792 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బుని స్వాధఘీనం చేసుకుంది.
బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖమంత్రి జితేంద్ర సింహ్ సమాధానమిచ్చారు. జనవరి 2019 నుంచి ఇప్పటి వరకూ నలుగురిని ఈడీ ఇండియాకు రప్పించిందని మరో ముగ్గురిని రప్పిస్తామని చెప్పారు.
2014 నుంచి ఇప్పటి వరకూ 1.6 లక్షల కోట్ల కంటే ఎక్కువ డబ్బులు స్వాధీనం చేసుకున్నట్టుగా రాజ్యసభలో ఇవాళ ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడైంది. దేశంలోని చాలామంది అత్యంత ధనికుల వద్ద కూడా ఇంత డబ్బు ఉండదు.