EPFO Pension Scheme: EP అకౌంట్ ఉన్న స్వీట్ న్యూస్.. ప్రతి నెల రూ.10 వేల పెన్షన్ మీ సొంతం!
అలాగే వేతన పరిమితిని పెంచాలని కూడా ఇటీవలే కేంద్రానికి చాలా డిమాండ్స్ వచ్చాయి. ఈ వేతన పరిమితి దాదాపు 40 శాతం పెంచి.. రూ.21 వేలకు తీసుకు రావలని ఇప్పటికే కేంద్ర భావించిందట. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ వేతన పరిమితిపై ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిపై అధికారిక ప్రకటన కూడా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగులు మాత్రం రూ.21,000 కాకుండా.. ఏకంగా రూ.25,000కు పెంచాలని ఉద్యోగులు డిమాండ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే..
కేంద్రం త్వరలోనే ఈ వేతన పరిమితిని అందరూ అనుకున్నట్లే రూ.25 వేలు పెంచితే.. పీఎప్‌కి సంబంధించిన పొదుపు కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల అందరికీ అధిక పెన్షన్ అందే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం గతంలో ఈ వేతన పరిమితి రూ.6 వేలు మాత్రమే ఉండేది..
మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ వేతన పరిమితి రూ.15 వేలకు పెంచినట్లు సమాచారం. ఆ సమయంలో ఏకంగా 130 శాతం పెరగడం పెద్ద శుభసందర్భమే.. అయితే వచ్చే ఏడాదిలోనైనా వేతన పరిమితిని పెంచాలని కార్మిక, కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తోంది.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితిని పెంచితే.. దీని ప్రభావం దీర్ఘకాలిక సమయంలో చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా సాధరాణ ఉద్యోగులకు చాలా మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.
ఇప్పుడున్న లెక్కల ప్రకారం ప్రతి ఉద్యోగి జీతం నుంచి ప్రతి మంత్ 12 శాతం పీఎఫ్ కట్ అవుతుంది. ఇలా కట్ అయిన డబ్బులు మొత్తం కాకుండా 3 శాతం పిఎఫ్ అకౌంట్‌లో చేరుతాయి. మిగితావి మాత్రం 8 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కి చేరుతాయి.
గరిష్ట వేతనం ఒకవేళ రూ. 21 వేలకు చేరితే.. ఈఫీఎస్ పెన్షన్ దాదాపు రూ.10 వేలకు పైగా ప్రతి నెల వస్తుంది. అయితే ఈ పెన్షన్ అనేది కనీసం పెన్షన్ సర్వీస్‌లో 35 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది. ఇలా ఉంటేనే పెన్షన్ వర్తిస్తుంది.