EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

Mon, 25 Jan 2021-11:13 am,

EPF Balance Check: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని ఖాతాలలో జమచేస్తున్నారు. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO Latest News), ఈపీఎఫ్ ఖాతాదారులు అలర్ట్ అయ్యారు.

తొలుత మొత్తం 8.5శాతం వడ్డీని రెండు దఫాలుగా ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఒకేసారి ఈపీఎఫ్ ఖాతాల్లో మొత్తం వడ్డీని జమ చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఈపీఎఫ్ఓ(EPFO Latest Update) పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. పీఎఫ్ బ్యాలెన్స్‌ను నాలుగు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. 

Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి

ఆన్‌లైన్‌లో EPF Balance తొలుత http://epfindia.gov.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. అందులో మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఈ పాస్‌బుక్ మీద క్లిక్ చేయండి అక్కడ మీ వివరాలు నమోదు చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది మెంబర్ ఐడీ వివరాలు సబ్మిట్ చేస్తే ఈపీఎఫ్ బ్యాలెన్స్(PF Balance) వివరాలు కనిపిస్తాయి.

Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు

SMS ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ 

మీ పీఎఫ్ అకౌంట్, బ్యాంక్ ఖాతాలకు ఒకే నెంబర్ ఉండి.. ఆ నెంబర్‌ను ఈపీఎఫ్ఓలో అప్‌డేట్ చేసి ఉంటే మీ మొబైల్ నెంబర్‌కు తరచుగా పీఎఫ్ వివరాలు అందుతుంటాయి. లేకపోతే EPFOHO UAN అని టైప్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు మెస్సేజ్ చేయాలి. దాంతో మీ నెంబర్‌కు పీఎఫ్ వివరాలు అందుతాయి.

Also Read: RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం

మిస్డ్ కాల్ ద్వారా EPF Balance Check.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఫోన్‌కు వస్తాయి. యూఏఎన్ నెంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈపీఎఫ్ వివరాలు వెంటనే మీ రిజిస్టర్ మొబైల్‌కు పంపిస్తారు.

Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link