EPFO News: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. EPFO క్లెయిమ్స్ విషయంలో కీలక అప్‌డేట్..!

పీఎఫ్ విత్ డ్రా వేగాన్ని పెంచేందుకు EPFO మరిన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు, అదనపు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను ప్లాన్ చేస్తోంది.

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ రెజెక్షన్‌ను తగ్గించడంలో కీరోల్ ప్లే చేసింది. 2017-18 కాలంలో దాదాపు 13 శాతం ఉండగా.. 2022-23 నాటికి దాదాపు 34 శాతానికి పెరిగింది.

2022-23 మధ్య కాలంలో 5.2 కోట్ల క్లెయిమ్‌లు రాగా.. తుది సెటిల్‌మెంట్‌లు, బదిలీలు, ఉపసంహరణలకు సంబంధించి 25.8 శాతం తిరస్కరణకు గురైనట్లు అధికారిక డేటాలో వెల్లడైంది.
ఇటీవల సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌తో క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం పెరిగింది. దీంతో చందదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నుంచి చందదారులు కంపెనీ మారినా.. చెల్లింపు వ్యవస్థలను క్రమబద్ధీకరించడానికి, రికార్డులను ఒకే చోట నిర్వహించేలా EPFO డేటాబేస్‌ను ఏర్పాటు చేయడానికి పని చేస్తోంది. మరో రెండు నెలల్లో ఇది కార్యరూపం దాల్చనుంది.
అంతేకాకుండా ఇటీవల పాలసీ మార్పులు జరిగాయి. క్లెయిమ్‌ల కోసం కొన్ని డాక్యుమెంటేషన్ అవసరాలను సడలించారు.
డాక్యుమెంట్ల కారణంగా 10 శాతం క్లెయిమ్‌లు రిజెక్ట్ అవుతున్నాయి. ఈ మార్పులతో ఈపీఎఫ్‌ఓ వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.