EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ న్యూస్.. రూ.కోటి ఫండ్ కోసం ఇలా ప్లాన్ చేయండి..!
ఉదాహరణకు ఓ ఉద్యోగి బేసిక్ పే, డీఏ కలిపి 25 వేలు అనుకుందాం. ఉద్యోగి వయసు 30 ఏళ్లు అనుకుంటే.. 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారు.
ప్రతి నెలా ఉద్యోగి జీతంలో 12 శాతం డిపాజిట్ చేస్తారు. ఇందుకు కంపెనీ 3.67 శాతం డిపాజిట్ చేస్తుంది. ఈపీఎఫ్ వడ్డీ రేటు సంవత్సరానికి 8.1 శాతం లెక్కిద్దాం.
ప్రతి సంవత్సరం 10 శాతం పెరుగుతూ ఉంటే.. మీరు 58 సంవత్సరాల వయస్సులోపు దాదాపు రూ.1.68 కోట్లు పొందవచ్చు.
అంటే ఉద్యోగి రూ.50.51 లక్షలు చెల్లిస్తే.. కంపెనీ రూ.16.36 లక్షలు జమ చేస్తుంది. అంటే మొత్తం రూ.69.87 లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ కలిపితే దాదాపు రూ.1.68 కోట్లు అవుతుంది.
ఒకవేళ మీరు ఆర్థిక సంవత్సరం చివరి రోజున నిధులను ఉపసంహరించుకుంటే.. మీ మొత్తం బ్యాలెన్స్ నుంచి విత్ డ్రా చేసిన అమౌంట్‌ను తీసేసి.. ఆ సంవత్సరానికి వడ్డీ లెక్కిస్తారు.
ఒకవేళ మీరు ఆర్థిక సంవత్సరం చివరి రోజున నిధులను ఉపసంహరించుకుంటే.. మీ మొత్తం బ్యాలెన్స్ నుంచి విత్ డ్రా చేసిన అమౌంట్‌ను తీసేసి.. ఆ సంవత్సరానికి వడ్డీ లెక్కిస్తారు.