EPFO New Year Gift: ప్రైవేటు ఉద్యోగులకు 2025 న్యూ ఇయర్ బంఫర్ గిఫ్ట్.. EPFO నుంచి ఏకంగా రూ.9,000 పెన్షన్!
ప్రైవేటు ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన తర్వాత EPFO నుంచి 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ వచ్చేది. అయితే తక్కువ వయస్సులో కూడా పెన్షన్ పొందే అవకాశాన్ని కేంద్ర అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
EPFO పెన్షన్ పథకంలో ప్రైవేటు ఉద్యోగులుకు చాలా ఉపయోగపడేది సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్.. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో సులభతరం చేయబోతోంది. దీని కారణంగా పదవీ విరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులకు చాలా లబ్ధి జరుగుతుంది.
సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ కింద సులభంగా 58 ఏళ్లు నిండిన పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కూడా EPFO నుంచి పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్ పొందాలనుకునేవారు తప్పకుండా అప్లే చేసుకోవాల్సి ఉంటుంది.
సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ పొందడానికి EPFO ఖాతాలో తప్పకుండా జీతం నుంచి దాదాపు 12 శాతం వరకు జమ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా తప్పకుండా 10 సంవత్సరాలకు పైగా మీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.
సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ కింద ప్రతి ప్రైవేటు ఉద్యోగి గరిష్ఠంగా ప్రతి నెల రూ.9,000 పెన్షన్ పొందవచని EPFO రూల్స్ చెబుతున్నాయి. అయితే 2025 సంవత్సరంలో ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి.
ఈ పథకం ద్వారా ప్రైవేటు ఉద్యోగులు పెన్షన్‌ను ప్రతి ఏడాది రూ.1,08,000 వరకు పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ పథకం గురించి తెలుసుకోవడానికి EPFO కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది.