Exercise Tips: గుండె పోటు సమస్యలకు వారికి 2 సార్లు ఈ వ్యాయామాలు చేస్తే చాలు..
గుండె జబ్బులు, మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా రోజూ వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా క్యాన్సర్‌ను నివారించే గుణాలు వ్యాయామంలో ఉన్నాయి. కావున వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చాలా మంచిది.
శరీరాన్ని దృఢంగా చేసేందుకు వ్యాయామాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కావున శరీరం ఫిట్‌గా ఉంచుకోవాలనుకునే వారు తప్పకుండా రోజూ 40 నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో వ్యాధులు నుంచి 35% ప్రమాదం తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కేవలం కొన్ని రకాల వ్యాయామాలు చేయడమేకాకుండా యోగా చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్కాట్‌లాండ్‌లో 63,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులు వారానికి 1 నుంచి 2 రోజులు వ్యాయమం చేసిన వారికి గుండె సమస్యలు, మధుమేహం సమస్యలు దూరమయ్యాయని ఆరోగ్య సర్వేలు తెలిపాయి.
వారానికి 1 నుంచి 2 రోజుల పాటు వ్యాయామాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వ్యాయామాలు చేసే క్రమంలో తప్పకుండా మంచి ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో చెడు ఆహారాలను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యల పాలయ్యే అవకాశాలున్నాయి. కావున మధుమేహంతో బాధపడే వారు తప్పకుండా ఇలా వ్యాయామాలు చేయాలి.
అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి వారం 150 నిమిషాల పాటు వ్యాయామాలు చేయోచ్చు. అయితే రోజూ వ్యాయామాలు చేయని వారు ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మధుమేహం సమస్యలున్న వారు ఇలా వ్యాయమం చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం సులభంగా నియంత్రణలో ఉంటుంది.