Oymyakon: ప్రపంచంలోనే అత్యంత చల్లనిప్రదేశం ఇదే...
రష్యాలోని సైబీరియాలో Oymyakon అనే గ్రామం ఉంది. అంటార్కిటిక తరువాత ప్రపంచంలో ఉన్న అత్యంత చల్లని ప్రదేశం ఇదే. ఇక్కడ ఉష్ణోగ్రత యావరేజ్‌గా సుమారు మైనస్ 50 డిగ్రీలు ఉంటుంది.
2018లో అధికారిక రికార్డుల ప్రకారం ఈ గ్రామంలో సుమారు 500 నుంచి 800 మంది నివసిస్తుంటారు. ఈ గ్రామం గురించి సరిగ్గా తెలియకుండా వచ్చి చాలా మంది చలికి మరణిస్తుంటారట. 1924లో అత్యల్పంగా 71.2 సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదు అయిందట.
ఇక్కడి వాతావరణాన్ని బట్టి బతకడం చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు పిల్లలు. మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ వద్ద పిల్లలు స్కూలుకు వెళ్తుంటారు. అంతకు మించిన ఉష్ణోగ్రత పడిపోతే స్కూళ్లు మూసి వేస్తారు.
డిసెంబర్ నెలలో సూర్యుడు ఇక్కడ ఉదయం 10 గంటలకు ఉదయిస్తాడు. ఇక్కడ కార్లు ఎప్పుడూ ఆఫ్ అవవు. ఆఫ్ చేస్తే కారు బ్యాటరీలు గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.
చలికాలం ఇక్కడ మొక్కలు కూడా మొలవలేవు. అందుకే అక్కడ చలికాలం వ్యవసాయం సాగదు. అందుకే మాంసమే తీసుకుంటారు. చేపలు, జింకలు, గుర్రాలు.. ఇలా వీరి ప్రోటీన్ సోర్స్ లిస్టు పెద్దదే.!