Fake Potatoes: తస్మాత్‌ జాగ్రత్త.. మార్కెట్లో నకిలీ బంగాళదుంపలు.. ఇలా గుర్తించకపోతే రోగాల పాలు..

Mon, 21 Oct 2024-8:21 pm,

అయితే ఫుడ్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ప్రకారం బంగాళదుంపలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. నకిలీ బంగాళదుంపలు తీసుకొని మీరు మెల్లిగా గిల్లితే అందులోంచి రంగు బయటకు వస్తుంది. అంతేకాదు వాటిని నీళ్లలో ముంచినా కానీ ఒక రకమైన రంగు కనిపిస్తుంది.  

ఇలాంటి రంగు పూసిన బంగాళదుంపలు ఉపయోగించడం వల్ల హానికరం. ముఖ్యంగా ఇందులో కాల్షియం కార్బైడ్‌ ఉపయోగిస్తున్నారు. ఈ బంగాళదుంపలను వండుకోవటం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఎందుకంటే ఇది వాంతులు, డయేరియా, కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేలా చేస్తుంది. అంతేకాదు పరిస్థితి చేయి దాటితే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరమని fssai తెలిపింది.  

రంగు మారిన బంగాళదుంపలు కనిపిస్తే ఏమాత్రం అలసత్వం చేయకండి.  నీటిలో కడిగినా మీకు రంగు తెలిసిపోతుంది. అంతే కాదు ఇలాంటి బంగాళదుంపలు ఒకే రకమైన పరిమాణాన్ని కలిగి ఉంటాయి. మీరు కట్ చేసి నా కానీ దాని లోపలి భాగం తెలుపు రంగులో ఉండదు. దీని వాసన కూడా ఒక విధంగా వస్తుంది మామూలు బంగాళదుంప వాసన రాదు.  

ఇలాంటి కల్తీ అయినా బంగాళదుంపలతో కూరలు వండుకొని తీసుకోవటం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే మీకు ఇలాంటి బంగాళదుంపలపై ఏకాస్త సందేహం వచ్చినా మీ లోకల్ ఫుడ్ సేఫ్టీ అధికారులను వెంటనే సంప్రదించండి.  

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link