Vijay Devarakonda Recent Movies 1st Day Collections: `ఫ్యామిలీ స్టార్` కంటే ముందు విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ డీటెల్స్..

Fri, 05 Apr 2024-9:12 am,

ఫ్యామిలీస్టార్.. (Family Star)

పరశురామ్ పేట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయిక నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా మొదటి రోజు ఎంత రాబడుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల మధ్య షేర్ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఖుషీ (Khushi)..

 శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'ఖుషీ'. ఈ మూవీ మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు.. రూ. 9.87 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

లైగర్ (Liger)

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా  తెరకెక్కిన చిత్రం 'లైగర్'. హీరోగా విజయ్ దేవరకొండకు తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు.. రూ. 9.57 కోట్ల షేర్ రాబట్టింది.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover)   విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ మూవీ అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.40 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

 

డియర్ కామ్రేడ్.. (Dear Comrade) గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా యాక్ట్ చేసిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 7.50 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

టాక్సీవాలా.. (Taxiwala) రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ 'టాక్సీవాలా'. ఈ మూవీ అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు.. రూ. 3.30 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

నోటా (NOTA) ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సీఎం పాత్రలో నటించిన సినిమా 'నోటా'. ఈ మూవీ ఫస్ట్ డే రూ. 5.81 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

గీత గోవిందం(Geetha Govindam) పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ,రష్మిక జోడిగా నటించిన సినిమా 'గీత గోవిందం'. ఈ సినిమా తొలి రోజు అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.81 కోట్ల షేర్ రాబట్టింది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link