Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు
పెళ్లయిన వారు రెండు సంవత్సరాలలో సైతం తల్లిదండ్రులు కాకపోతే, సమస్య స్త్రీలోపమేనని భావిస్తుంటారు. కానీ ఇలాంటి విషయాలలో సమస్య అధికంగా మగవారిలోనే ఉంటుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఎండోక్రైన్ సమతుల్యతకు అంతరాయం కలగడం, వీర్యకణాల నాణ్యత మరియు సంఖ్య లాంటి అనేక కారణాల వల్ల మగవారు వంధ్యత్వానికి గురవుతారు. వివాహిత గర్భం దాల్చకపోతే మొదటగా సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మగవారిలో సంతానోత్పత్తికి సంబంధించి అపోహలు, వాటికి సమాధానాలు మీకోసం. (Photo: thehealthsite)
Also Read: White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం
వంధ్యత్వం (Infertility) విషయానికి వస్తే మహిళలు తరచూ విమర్శలకు గురవుతారు. కానీ బిడ్డ పుట్టడానికి తల్లిదండ్రులు ఇద్దరూ కారణమని, లోపం ఉంటే అందుకు ఇద్దరు కారణం కాదని భావిస్తారు. కేవలం స్త్రీలలో లోపం కారణంగానే పిల్లలు పుట్టడం లేదని భర్తలు, అత్తింటి వారు వివాహితలను ఇబ్బందులకు గురిచేయడం గురించి వింటుంటాం. కానీ పిల్లలు పుట్టకపోవడానికి కేవలం మహిళలు మాత్రమే కారణం కాదు, మగవారిలోనూ లోపం ఉంటుందని తెలుసుకోండి. వీర్య కణాల యొక్క నాణ్యత మరియు సంఖ్యపై పిల్లలు పుట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టని చాలా కేసులలో వంధ్యత్వానికి గురైన పురుషులకు వీర్య కణాలు తక్కువగా ఉండటం, లేదా నాణ్యమైన వీర్య కణాలు లేకపోవడమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలలో తేలింది. (Photo: thehealthsite)
అవును, పురుషులు 60 ఏళ్ల తరువాత సైతం తండ్రులయ్యారు. కానీ దానిని బట్టి మగవారిలో సంతానోత్పత్తిని వయస్సుకు అది సాక్ష్యమని భావించకూడదు. ఎంత వయసు వచ్చినా మగవారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయని అపోహ ఉంటుంది. కానీ ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత పురుషులలో వీర్యకణాల నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మగవారిలో వయసు మీద పడ్డ తరువాత సంతానోత్పత్తిలో గర్భస్రావం మరియు 9 నెలలకు ముందుగానే పిల్లలు జన్మించడం లాంటి సమస్యలు వస్తాయి. వయసు విషయానికొస్తే పురుషులతో పోలిస్తే సంతానోత్పత్తి క్షీణించడం మహిళల్లో చాలా వేగంగా ఉంటుంది, మరోవైపు వయసు మీద పడిన తల్లిదండ్రుల పిల్లలు ఇతర చిన్నారులల అంత చురుకుగా ఉంటారని చెప్పలేము. (Photo: thehealthsite)
Also Read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ చిన్నారులకు ప్రమాదకరం, పిల్లలలో కరోనా కొత్త లక్షణాలివే
వీర్య కణాలు తక్కువైతే పిల్లలు పుట్టరు అనే అపోహలు సైతం మగవారిలో ఉంటాయి. దీనివల్ల కలిగే వంధ్యత్వ సమస్యకు చికిత్స చేయించుకోవచ్చు. వీర్యకణాల సంఖ్య, నాణ్యతను పరిశీలించిన తరువాత సంతానోత్పత్తి నిపుణులు మీకు చికిత్స అందిస్తారు. దానివల్ల వీర్యకణాలు నాణ్యత పెరిగి తండ్రి అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. (Photo: thehealthsite)
ఎన్నో కుటుంబాలను పట్టి పీడిస్తున్న సమస్యలలో అంగస్తంభన సమస్య లేదా నపుంసకత్వము ఒకటి. చాలా మంది నపుంసకత్వము మరియు వంధ్యత్వం ఒకటేనని నమ్ముతారు. కానీ ఈ రెండింటి అర్ధాలు వేరు. వీటి లక్షణాలు, సమస్య వేరు అని తెలుసుకోండి. వంధ్యత్వం అంటే పిల్లలు పుట్టే అవకాశం లేనివారిని సూచిస్తుంది, అయితే నపుంసకత్వము అంటే అంగస్తంభన కలగని మగవారిని సూచిస్తుంది. (Photo: thehealthsite)
Also Read: Covid-19 Symptoms: ఆ కరోనా బాధితులకు Steroids వాడకూడదు, ప్రముఖ వైద్యుడి సలహా
ఆధునిక జీవనశైలితో వీర్యకణాల నాణ్యత ప్రభావితం అవుతుంది. తద్వారా అండాలపై సైతం దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వాడకం, లోదుస్తులు బిగుతుగా ధరించడం, హానికరమైన రసాయనాలు వాడకం, మరియు లైంగిక సంక్రమణ వ్యాధులు పురుషులలో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చెడు అలవాట్లు సంతానోత్పత్తిపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. దీని ద్వారా వీర్యకణాల నాణ్యతతో పాటు వాటి సంఖ్య సైతం తగ్గి పిల్లలు పుట్టకపోవడం, లేదా వైకల్యం లాంటి సమస్యలతో చిన్నారులు జన్మించే అవకాశాలున్నాయి. (Photo: thehealthsite)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook