Covid-19 Symptoms: ఆ కరోనా బాధితులకు Steroids వాడకూడదు, ప్రముఖ వైద్యుడి సలహా

Covid-19 Symptoms: షుగర్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, అనియంత్రిత డయాబెటిస్ ఉన్నవారిని త్వరగా దాడి చేస్తుందని తెలిసిందే. కనుక షుగర్ పేషెంట్లు కచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకునేందుకు యత్నించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 21, 2021, 06:27 PM IST
Covid-19 Symptoms: ఆ కరోనా బాధితులకు Steroids వాడకూడదు, ప్రముఖ వైద్యుడి సలహా

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన గత ఏడాది నుంచి స్టెరాయిడ్స్ వాడకంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అధ్యయనాలలో వాటి వాడకంతో వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చునని తేలితే, మరికొన్ని అధ్యయనాలలో స్టెరాయిడ్స్ వాడితే బ్లాక్ ఫంగస్ లాంటి ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. 

షుగర్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, అనియంత్రిత డయాబెటిస్ ఉన్నవారిని త్వరగా దాడి చేస్తుందని తెలిసిందే. కనుక షుగర్ పేషెంట్లు (COVID-19 For Diabetes Patient) కచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకునేందుకు యత్నించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తొలుత కేవలం మధుమేహంతో బాధపడుతున్నవారిలోనే మ్యూకర్ మైకోసిస్ బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కేసులను గుర్తించామని, ఆ తరువాత క్యాన్సర్ బాధితులు, కిమోథెరపి చేయించుకున్న వారిలో రోగనిరోధక శక్తి క్షణీంచడంతో బ్లాక్ ఫంగస్ సమస్య బారిన పడుతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. 

Also Read: White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం

రోగనిరోధక శక్తి తగ్గుతున్న వారితో పాటు స్టెరాయిడ్స్ వాడుతున్న వారిలోనూ బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే స్వల్ప కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారికి అందుకు తగిన మెడిసిన్ ఇవ్వాలని, స్టెరాయిడ్స్ వాడకూడదని డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. లేనిపక్షంలో మ్యూకర్ మైకోసిస్ వీరిపైనా దాడిచేసి బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తుందన్నారు. కోవిడ్19 (Covid-19) బాధితులు స్టెరాయిడ్స్ అధికంగా తీసుకోవడం ద్వారా ఏ ఫలితం ఉండదని, రక్తంలో చక్కెర స్థాయి పెరిగడంతో, అనవసరంగా బ్లాక్ ఫంగస్ దాడికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని హెచ్చరించారు. 

Also Read: Black Fungus Symptoms: బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి..ఎవరికి ముప్పు ఎక్కువంటే 

మ్యూకర్ మైకోసిస్ భారతదేశంలో ఇప్పటివరకూ 7,250 మందికి సోకినట్లు సమాచారం. 13 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో బ్లాక్ ఫంగస్ బారిన పడి 219 మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు మ్యూకర్ మైకోసిస్‌ను నోటిఫైయబుల్ డిసీజ్‌గా గుర్తించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News