Samsung Galaxy F41 Price: శాంసంగ్ మొబైల్స్‌పై భారీ ఆఫర్లు, అడ్వాన్స్ క్యాష్ బ్యాక్!

Wed, 11 Nov 2020-7:04 pm,

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల కొత్త గెలాక్సీ మోడల్ F41ను లాంచ్ చేసింది. ఇందులో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ రెండు రకాల వేరియంట్స్‌ను శాంసంగ్ తీసుకొచ్చింది. 64 జీబీ వేరియంట్ ధర రూ.19,999, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 20,999 కాగా, ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 మొబైల్స్‌ ధర (Samsung Galaxy F41 Price) రూ.4500 తగ్గించింది. ప్రస్తుతం ఈ మొబైల్స్ 15,499, 16,499కి కొనుగోలు చేయవచ్చు. ఇంతకంటే తగ్గింపు ధరలతో పాటు మరెన్నో ఆఫర్లు వర్తించనున్నాయి.

Flipkart Smart Upgrade Plan ద్వారా Samsung Galaxy F41 64 జీబీ వేరియంట్‌పై మరో రూ.4650, 128 జీబీ స్టోరేజ్ మొబైల్‌పై Advance Instant Cash Back రూ.4950 లభించడంతో తగ్గింపు ధరకు మొబైల్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ప్లాన్ ఎంపిక చేసుకున్న కస్టమర్ తమ పేమెంట్ కచ్చితంగా ఏదైనా Credit Card/Credit Card EMI/Bajaj Finserv EMI Card ద్వారా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాది తర్వాత ఈ మొబైల్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుని వేరే మొబైల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫోన్ బ్లాక్ అవుతుంది. మీ మొబైల్‌కు లభించిన అడ్వాన్స్ Instant Cash Back రూ.4650, రూ.4950 ఏడాది తర్వాత చెల్లిస్తే ఏ సమస్య ఉండదు. (All Photos Credit: flipkart)

ఐసీఐసీఐ, సిటీబ్యాంక్, కొటక్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1000 తక్కువ ధరకు మొబైల్ కొనుగోలు చేయవచ్చు. 

Samsung Galaxy F41 స్క్రీన్ 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-యూ డిస్‌ప్లే ఉంటుంది.  ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌ అమర్చారు. స్టోరేజ్‌ను 512 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం కల్పించారు.

రియర్ కెమెరా (Back Camera) 64 మెగా పిక్సెల్. మరో 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగా పిక్సెల్ టెర్షియరీ సెన్సార్‌‌లు సైతం ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ అందించారు. (All Photos Credit: flipkart)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link