Shani dev: శని చెడు ప్రభావంతో బాధపడుతున్నారా..?.. ఈ ఒక్క పరిహారం పాటిస్తే మీ లైఫ్‌లో అన్ని అద్భుతాలే..
శనిదేవుడు ఎంతో కరుణ గలదేవుడని చాలా మందికి తెలీయదు. ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రంమే ఫలితాలు ఇస్తుంటాడు. సూర్యుడి కుమారుడు, యమధర్మరాజు సోదరుడు శనిదేవుడు.
ఆయన చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలు ఇస్తుంటాడు. అందుకే మంచి పనులు చేయాలని కూడా పండితులు చెబుతుంటారు. మెయిన్ గా.. శనిదేవుడు సాడేసాతి, అర్ధష్టమ, ఏలినాటి ప్రభావాలు కల్గజేస్తుంటాడు.
ఈ సమయంలో మనిషి చాలా ఇబ్బందులకు గురౌతుంటాడు. అయితే.. శనిదేవుడికి కొన్ని పరిహారాలు పాటిస్తే మాత్రం అనుకొని విధంగా ధనలాభాలు కల్గుతాయని పండితులు చెబుతుంటారు.
శనివారం రోజున శనిదేవుడికి నూనెతోఅభిషేకం చేయాలి. అంతేకాకుండా. . నల్లని బట్టలను దానంగా ఇవ్వాలి. నవధాన్యాలను దానంగా ఇవ్వాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి.
శనిదేవుడికి వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు అంటే ఎంతో ఇష్టం. అందుకే హనుమంతుడికి తమలపాకులతో పూజించాలి.వెంకటేశ్వర వ్రతంను ఆచరించిన కూడా మంచి ఫలితాలు కల్గుతాయి.
అదే విధంగా శనివారం రోజున ఇనుప వస్తువులు ఇంటికి తేకూడదు. కొత్తబట్టలు, ఉప్పు, నూనెలు ఇంటికి తెచ్చుకోకూడదు. చెప్పులు కొనకూడదు. ఆరోజున శనికి ఇష్టమైన కాకికి, కుక్కలకు ఆహారంగా రొట్టేలు, ఆహారం తినడానికి పెట్టాలి. ఇలా చేస్తే శనిదోషాలన్నిపోతాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)