Home Loan Tricks: గృహ రుణం పొందుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు లక్షల్లో డబ్బు ఆదా
ఇంటి కల|| మీ ఇంటి కలను తీర్చుకోవడానికి తప్పనిసరిగా గృహ రుణం పొందాల్సిన పరిస్థితి. ఈ రుణం పొందడంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే రుణ భారం పెరుగుతుంది.
లక్షల్లో డబ్బు ఆదా|| ఈ చిట్కాలు పాటిస్తే గృహ రుణాల విషయంలో లక్షల్లో డబ్బు ఆదా అవుతుంది. మీకు రుణ భారం అనేది కొంత తగ్గుతుంది.
కాల వ్యవధి|| గృహ రుణం పొందిన తరువాత ఆ రుణాన్ని తీర్చడానికి 30 సంవత్సరాల వరకు కాల వ్యవధి ఉంటుంది. మీరు మరికొన్ని సంవత్సరాలకు పెంచుకుంటే ఈఎంఐ తక్కువగా ఉంటుంది.. వడ్డీ పెరుగుతుంది.
త్వరగా తీర్చే|| దీర్ఘకాలం వరకు గృహ రుణం పొందినప్పటికీ రుణం ముందే చెల్లించే ప్రయత్నం చేయాలి. త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తే రూ.లక్షల్లో డబ్బు ఆదా అవుతుంది.
భార్య పేరు|| గృహ రుణం దరఖాస్తు సమయంలో భార్య పేరును చేర్చండి. ఉమ్మడి రుణంలో (జాయింట్ లోన్) వడ్డీ తక్కువగా ఉంటుంది. మహిళల పేరుతో గృహ రుణంలో తక్కువ వడ్డీ సౌకర్యం ఉంటుంది.
బీమా|| ఇల్లు కొనేందుకు తీసుకుంటున్న గృహ రుణ సమయంలో తప్పక బీమాను ఎంచుకోండి. గృహ రుణ బీమా తీసుకుంటే కష్ట సమయంలో ఇది మీ కుటుంబసభ్యులకు ఆదుకుంటుంది.
వడ్డీ రేట్లు| వడ్డీ రేట్లు అప్పుడప్పుడు పెరుగుతుంటాయి. వడ్డీ రేట్లు పెరిగిన సమయంలో గృహ రుణ వడ్డీ ధరలు బదలాయించకుండా బ్యాంక్ అధికారులో మాట్లాడండి. ఏ కారణం చేత కూడా రుణ కాల వ్యవధిని పెంచవద్దు.