Footwear Prices: చెప్పులు కొనలనుకుంటున్నారా?వెంటనే కొనేయ్యండి..ఆగస్ట్ 1 నుంచి చెప్పుల ధరలపై మోత.!

Mon, 29 Jul 2024-6:58 pm,

Upcoming BIS Guidelines : వచ్చే నెల ఆగస్టు నుంచి పాదరక్షల ధరలు పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రావడమే ఇందుకు  కారణమని చెప్పవచ్చు. దీంతో చెప్పులు కొనుగోలు చేసే వినియోగదారులపై మరింత భారం పడనుంది. పాదరక్షలకు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి వస్తాయి. అప్పటి నుంచి తయారు చేసే బూట్లు, స్లిప్పర్లు, సాండిల్స్ ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్ట్ స్పష్టం చేసింది. దీంతో వచ్చే నెల చెప్పులు ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.   

ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే నాణ్యతా నియంత్రణ ఉత్తర్వుల ప్రకారంగా చూస్తే..పాదరక్షల తయారీదారులు ఐఎస్ 6721, ఐఎస్ 10702 నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ సవరించిన నాణ్యతా నిబంధనల ప్రకారం..చెప్పుల తయారీలో ఉపయోగించే రెగ్జిన్, ఇన్ సోల్ వంటి రా మెటీరియల్ కు తప్పనిసరిగా రసాయన పరీక్షలు చేయించాలి. చెప్పుల బయటి భాగాలకు ఉపయోగించే మెటీరియల్ చెరగకుండా, ఎక్కువగా మన్నికగా ఉంటుందని చెప్పే నాణ్యతా పరీక్షలో పాస్ అవ్వాల్సి ఉంటుంది.   

కాగా వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఎక్కువ కాలం మన్నికగా ఉండే ఉత్పత్తులను అందించేందుకు ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ఈ కొత్త నిబంధన నుంచి చిన్న కంపెనీలకు ఉపశమనం లభించనుంది.   

రూ.50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు ఈ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదు. పాత స్టాక్ షూస్ కూడా ఈ నిబంధన పరిధికి దూరంగా ఉన్నాయి. అయితే ఈ షూల గురించి సమాచారాన్ని BIS వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.  

ఈ కొత్త నిబంధన అమలుతో, చెప్పులు, షూస్, బూట్లు, సాండిల్స్  ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త ప్రమాణం ప్రకారం బూట్లు తయారు చేయడానికి కంపెనీలకు ఎక్కువ ఖర్చు అవుతుంది.ఆగస్టు 1 నుంచి బూట్లకు సంబంధించిన 46 వస్తువులపై కొత్త బీఐఎస్ నిబంధనలు వర్తిస్తాయి.

ప్రజలకు సమాచారం అందించేందుకు బ్యూరో ఈ నిబంధనలను తన వెబ్‌సైట్‌లో ఉంచింది.కొత్త నిబంధనల ప్రకారం, రెక్సిన్, ఇన్సోల్, లైనింగ్ వంటి షూలలో ఉపయోగించే పదార్థాలను పరీక్షించనున్నారు. షూ బయటి భాగాన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా పరీక్షిస్తారు. 

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వస్తువులు, ప్రక్రియలు, సిస్టమ్‌లు, సేవల కోసం మంచి నియమాలను రూపొందించింది. వస్తువులు మన్నికగా ఉంటున్నాయా లేదా అని చూసస్తుంది.  అవి బాగా తయారు చేయబడుతున్నాయా లేదా అని చూస్తుంది.   

BIS మంచి వస్తువులను తయారు చేయడానికి నియమాలను రూపొందించింది. ఆపై ఈ నిబంధనల ప్రకారం వస్తువులు తయారు చేయబడాయా లేదా అనేది చెక్ చేస్తుంది. పరీక్షల అనంతరం ఆ వస్తువులు మంచి నాణ్యత ఉన్నయా లేదా అనేది కూడా వెల్లడిస్తుంది.   

క్వాలిటీ లేని వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు, దేశీయ తయారీని పెంచేందుకు ప్రభుత్వం స్విచ్, సాకెట్, కేబుల్ వంటి ఎలక్ట్రికల్ వస్తువులకు నాణ్యత నిబంధనలను తప్పనిసరి చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ ఆర్డర్ 2023ను ఈ ఏడాది జనవరి 1న డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం విద్యుత్ పరికరాలపై బీఐఎస్ గుర్తు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే వస్తువులను విక్రయించడం నిషేధిస్తారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link