Friendship day 2024: స్నేహం కోసం సహా తెలుగులో స్నేహం విలువ చెప్పిన చిత్రాలు..పార్ట్ 2
స్నేహం కోసం: చిరంజీవి, విజయ్ హీరోలుగా కే.యస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా స్నేహం విలువను చాటి చెప్పింది.
స్నేహమంటే ఇదేరా: నాగార్జున, సుమంత్ హీరోలుగా తెరకెక్కిన ‘స్నేహమంటే ఇదేరా’. ఈ చిత్రం స్నేహాం విలువను చాటి చెప్పింది.
పెళ్లి పందిరి: జగపతి బాబు, పృథ్వీ స్నేహితులుగా తెరకెక్కిన సినిమా ‘పెళ్లి పందిరి’. ఈ సినిమా ఫ్రెండ్ షిప్ కు కొత్త అర్ధాన్ని చెప్పింది.
వసంతం: స్నేహం అంటే కేవలం ఆడ, మగ వాళ్ల మధ్య కాదు.. ఆడ, మగ మధ్య స్నేహం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘వసంతం’. ఈ సినిమా స్నేహ బంధాన్ని గొప్పగా ఆవిష్కరించింది.
ప్రాణానికి ప్రాణం: నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రాణానికి ప్రాణం’. ఫ్రెండ్ షిప్ కు కొత్త అర్ధం చెప్పిన చిత్రాల్లో ఇది ఒకటి.
కొండపల్లి రాజా: స్నేహానికి కొత్త అర్ధం చెప్పిన చిత్రాల్లో వెంకటేష్, సుమన్ హీరోలుగా తెరకెక్కిన ‘కొండపల్లి రాజా’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.