Rashmika Mandanna Beauty Secrets: శ్రీవల్లి ఇంత అందంగా కనిపించడానికి కారణం ఏంటో తెలుసా.. బ్యూటీ సీక్రెట్స్ ఇవే..
రష్మిక తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేస్తుంది. ఆమె అందం అంతా ఇంతా కాదు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతూ ఉంటుంది.
నటనతో మాత్రమే కాకుండా రష్మిక మందన్న తన బ్యూటీ టిప్స్‌తో కూడా అందరిని ఆకట్టుకుంటుంది. మరి ఈ పాన్ ఇండియా హీరోయిన్ అందంగా కనిపించడానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఐటీసీ ఫియామా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రష్మిక.. తన చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. రోజూ క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్ వాడటం ఆమె రొటీన్‌లో భాగం. అలాగే, సన్‌స్క్రీన్ క్రీమ్ వాడటం కూడా మరచిపోదు. ముఖ్యంగా రిచ్, క్రీమ్ ఫార్ములా ఉన్న ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తారు.
రిచ్, క్రీమ్ ఫార్ములా ఉన్న ప్రొడక్ట్స్‌ను చర్మానికి ఉపయోగించడం వల్ల ఈ ప్రొడక్ట్స్‌లో ఉండే నూనెలు, మాయిశ్చరైజర్లు చర్మాన్ని లోతుగా తేమగా చేస్తాయి. ఫలితంగా చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
చాలా మంది నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. వీటిని వల్ల చర్మం అందంగా కనిపించడదు. దీని కోసం రష్మిక ఒక ప్రత్యేకరమైన ఫేస్ మాస్క్‌ను ఉపయోగిస్తారు. అదే చందనం ఫేస్ మాస్క్. చందనం చర్మాన్నికి ఎంతో సహాయపడుతుంది. ఈ మాస్క్‌ను 15-20 నిమిషాలు ఉంచితే ముఖం రిఫ్రెష్, మెరుస్తుంది.
కేవలం చర్మం రక్షణలో మాత్రమే కాకుండా శరీరం ఎల్లప్పుడు సువాసనగా కూడా ఉండటం అవసరం. దీని కోసం చాలా మంది అనేక రకాల పెర్ఫ్యూమ్ లు ఉపయోగిస్తారు. రష్మిక మాత్రం గంధపు పెర్ఫ్యూమ్ ఎంతో సహాయపడుతందని చెబుతున్నారు. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు ఇది చర్మాన్ని కూడా మంచిదని అంటున్నారు.
అందంగా కనిపించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం రష్మిక అందానికి మరో కారణం. ఆమె పండ్లు, కూరగాయలు, గింజలు ఎక్కువగా తింటుంది.ప్రతి రోజూ వ్యాయామం చేస్తుంది. ఇది ఆమె శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా, చర్మాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
రష్మిక రోజూ ఎక్కువ నీరు తీసుకుంటారు. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, మృదువుగా చేస్తుంది. దీంతో పాటు మేకప్‌ను చాలా తక్కువగా వాడుతుంది. సహజమైన అందాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడుతారు.