Unstoppable Show: బాలయ్యతో జాతిరత్నం.. మధ్యలో `కిస్సిక్` పిల్ల కలిస్తే రచ్చరచ్చే
ఆహాలో అన్‌స్టాపబుల్ షో దుమ్మురేపుతోంది. నాలుగో సీజన్‌లో అల్లు అర్జున్ ఎపిసోడ్‌కు ఊహించని స్పందన లభించింది.
ఓటీటీ వేదికలో నందమూరి బాలకృష్ణ పండుగ నడుస్తోంది. తాజా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో జాతిరత్నాలు సినిమాతో సంచలన విజయం పొందిన నవీన్ పొలిశెట్టి వచ్చేశాడు.
నవీన్‌తోపాటు పుష్ప 2లో కిస్సిక్ పాటతో దెబ్బలు పడతాయిరో అంటున్న శ్రీలీల కూడా ప్రత్యక్షమైంది. వీరిద్దరితో బాలయ్య జరిపిన సంభాషణ రాబోయే ఆదివారం ప్రసారం కానుంది.
సినీ పరిశ్రమలో కష్టపడి ఎదిగిన నవీన్ పొలిశెట్టి జీవితాన్ని బాలయ్య ప్రశంసించారు. ఈ ఎపిసోడ్‌లో నవీన్, బాలయ్య మధ్య నవ్వులు విరబూశాయని తెలుస్తోంది.
పుష్ప 2తోపాటు తన సినిమాలో నటించిన శ్రీలీలతో బాలకృష్ణ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సినిమాతోపాటు పుష్పలో ఐటమ్ సాంగ్‌పై ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
నవీన్ పొలిశెట్టి, శ్రీలీలతో సరదాగా ఆటలు.. నవ్వులాటలు.. మాటలు చాలా ప్రత్యేకంగా నిలుస్తోందని ఆహా నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌కు కూడా భారీ స్పందన లభిస్తుందని భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రొమో విడుదల చేసే అవకాశం ఉంది.