Amrapali: ఆ డిటెయిల్స్ చెప్పాల్సిన అవసరంలేదు.. జీఐఎస్ సర్వేపై కీలక విషయాలు వెల్లడించిన ఆమ్రపాలి..
గ్రేటర్ హైదరాబాద్ లో కొన్నిరోజులుగా జీహెచ్ఎంసీ అధికారులు జీఐఎస్ సర్వేను చేపట్టారు. దీనిలో భాగంగా.. అధికారులు నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు, భవన నిర్మాణ అనుమతులు మొదలైన వాటిని తనిఖీలు చేస్తున్నారు. పర్మిషన్ తీసుకున్న భవనాలకు అనుగుణంగా ఇల్లుకట్టారా..లేదా పర్మిషల్ ఒక దానికి తీసుకుని కార్యకలాపాలు మరోటి చేస్తున్నారా అనే దానిపై అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
జీఐఎస్ సర్వేలో పౌరుల నుంచి సేకరిస్తున్న భవనాలు, నీటి, విద్యుత్‌బిల్లుల సమాచారం గోప్యంగా ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) తెలిపారు. ఆధార్ నంబర్, వ్యక్తిగత వివరాలు సిబ్బంది తీసుకోరని సిబ్బంది అడిగినా ఇవ్వొద్దని పేర్కొన్నారు.
ఈ సర్వే వల్ల.. పెండింగ్ లో ఉన్న పన్నులు ఆస్తి, వాటర్ టాక్స్ లను గుర్తించడం ఈజీ అవుతుందని కూడా బల్దియా చెప్పింది. అంతేకాకుండా.. ఆస్తి పన్నుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
హై-రిజల్యూషన్ మ్యాపింగ్ రోడ్లు, పార్కులు, ఇతర సౌకర్యాల వివరాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. అదే విధంగా.. డ్రోన్ సర్వేతో పాటు రానున్న రోజుల్లో నగరమంతటా సర్వే కొనసాగుతుందని కూడా బల్దియా పేర్కొంది.
ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి, భవన నిర్మాణ అనుమతి, తాజా ఆస్తి పన్ను రసీదు, నీటి బిల్లు, యజమానుల ID, ఇతర సంబంధిత సమాచారంతో అందుబాటులో ఉండాలని అన్ని చోట్లు ఉండే నివాసితులు, ఆస్తి యజమానుల సహకారాన్ని అందించాలని కూడా బల్దియా అధికారులు కోరుతున్నారు.
మరోవైపు నగరంలో చెత్తాచెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం, స్వచ్ఛ ఆటో కార్మికులతో పాటు డిప్యూటీ కమిషనర్లు (డీసీ), అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు కూడా సమయానికి విధులకు హాజరు కావాలని, క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని ఆమె కోరారు.
సీఆర్‌ఎంపీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, మీడియన్‌ల వద్ద మొక్కలు నాటే పనులు, ఇతర పనులను పూర్తి చేయాలని జోనల్ కమిషనర్లను ఆమ్రాపాలి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. జీఐఎస్ సర్వేలో పౌరుల నుంచి సేకరిస్తున్న భవనాలు, నీటి, విద్యుత్‌బిల్లుల సమాచారం గోప్యంగా ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.
ఆధార్ నంబర్, వ్యక్తిగత వివరాలు సిబ్బంది తీసుకోరని చెప్పారు. ఒక వేళ ఎవరైన సిబ్బంది అడిగినా ఇవ్వొద్దని కూడా ఆమ్రాపాలి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. అధికారులు నగర వ్యాప్తంగా ప్రస్తుతం.. అధికారులు చేపట్టిన జియో ట్యాగ్ సర్వే కొనసాగుతుంది.