Amrapali: ఆమ్రపాలీ మరో సంచలనం.... వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలపై కీలక నిర్ణయం తీసుకున్న జీహెచ్ఎంసీ.. డిటెయిల్స్..
హైదరబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడటం కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి అన్నారు. ఇటీవల వినాయక చవితి నేపథ్యంలో కూడా.. కమిషనర్ భక్తులు కలర్స్ పేపర్ విషయంలో కూడా కొన్ని రిక్వెస్టులు చేశారు. సెలబ్రేషన్స్ లో భాగంగా కలర్స్ పేపర్స్ లు ఎక్కువగా ఎక్కడంటే.. అక్కడ పాడేయకూడదంటూ సూచించారు.
ముఖ్యంగా హైదరబాద్ లో వరదలు వచ్చినప్పుడు కూడా ఆమ్రపాలీ ఎంతో యాక్టివ్ గా పనిచేశారు. ఒకవైపు తాను రంగంలోకి దిగి సహాయకచర్యలు తెలుసుకుంటూ,మరోవైపు అధికారుల్ని సైతం పరుగుల పెట్టించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జియో ట్యాగింగ్ పై కూడా ప్రత్యేకంగా అవగాహాన కల్పించారు.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ బల్దియా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించడం, సుందరీకరణ లక్ష్యంగా నగరంలోని ప్రజలు..పాటించాల్సిన కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో.. అనుమతులు లేని వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ లను నిషేధించినట్లు కమిషనర్ ఆమ్రపాలి కాట తెలిపారు. అనుమతులు లేకుండా గోడలపై పోస్టర్లు అంటించడం, వాల్ రైటింగ్స్ చేసినట్లైతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆయా సర్కిళ్ల సంబంధిత డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్, సినిమా థియేటర్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి గోడలపై వాల్ పోస్టర్స్, సినిమా పోస్టర్లు అంటించకుండా, వాల్ రైటింగ్ రాయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు..
ఈ విషయంలో డిప్యూటీ కమిషనర్లు అశ్రద్ధ వహించకుండా కఠినంగా వ్యవహరించాలని, అనుమతి లేకుండా వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైన అతిక్రమిస్తే.. అవసరమైతే జరిమానాలు విధించాలని ఆదేశించారు. జరిమానాల వివరాల నివేదిక పంపించాలని కమిషనర్ ఆమ్రపాలీ ఉత్తర్వులు సైతం జారీ చేశారు.