GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!
ఎట్టకేలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC Elections 2020) పూర్తయ్యాయి. ఓల్డ్ మలక్‌పేటలో డిసెంబర్ 1వ తేదీన వాయిదా పడిన పోలింగ్ ప్రక్రియ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020 ఎగ్జిట్ పోల్స్ (GHMC Exit Polls 2020) వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఆరా సంస్థ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయన్నది తెలిపింది. ఆ వివరాలిలా ఉన్నాయి..
ఆరా సంస్థ టీఆర్ఎస్ (TRS)కు మెజార్టీ స్థానాలు వస్తాయని వెల్లడించింది. టీఆర్ఎస్ పార్టీ 71 నుంచి 85 సీట్లు కైవసం చేసుకోనుంది. గులాబీ పార్టీ 40.08 శాతం శాతం ఓట్లు సాధించింది
GHMC Elections 2020లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసిన బీజేపీకి 23 నుంచి 33 స్థానాలు వస్తాయని చెప్పింది. అయితే టీఆర్ఎస్ తర్వాత అత్యధికంగా 31.21 శాతం ఓట్లును కమలదళం సాధించడం గమనార్హం.
టీఆర్ఎస్ తర్వాత ఏఐఎంఐఎం పార్టీ 36 నుంచి 46 సీట్లు గెలుచుకుంటుందని ఆరా సంస్థ పేర్కొ్ంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి 13.43 శాతం ఓట్లు పోలయ్యాయి.
GHMC Electionsలో కాంగ్రెస్ పార్టీ మరోసారి విఫలమైనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 0-6 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఆరా సంస్థ పేర్కొంది. 8.58 శాతం ఓట్లను హస్తం పార్టీ సాధించింది. ఇతరులకు 7.70 శాతం ఓట్లు పోలయ్యాయి.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!